Kodanda Reddy: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పక్కా రసీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడ్తున్నారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం భేటి అయింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడ్తున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ఇక తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిస్తున్నారని, అయితే రైస్ మిల్లుల్లో ధాన్యం దించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం సరైంది కాదన్నారు.
Also Read: Kodanda Reddy: రైతులు చిరుధాన్యాలు సాగు చేయాలి.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రైతు కమిషన్ కు ఫిర్యాదులు
చాలా ప్రాంతాల నుంచి రైతులు ఈ విషయంపై రైతు కమిషన్ కు ఫిర్యాదులు చేశారన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి ఇలాంటివి మరో సారి జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి తదితరులున్నారు.
Also Read: Kodanda Reddy: రైతు ర్యాయితీలకు పూసగింజలు .. ఉద్యానవన పంటలకు కొత్త వెలుగు.. రైతు కమిషన్ చైర్మన్
