Rajinikanth Journey: సాధారణ బస్ కండక్టర్ నుండి భారతీయ సినిమా దిగ్గజంగా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం అద్భుతం, ఎందరికో స్ఫూర్తిదాయకం. డిసెంబర్ 12, 1950న బెంగళూరులో మరాఠీ కుటుంబంలో శివాజీరావు గైక్వాడ్ గా జన్మించారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు మరియు కెరీర్ హైలైట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. రజనీకాంత్ తండ్రి రామోజీరావు గైక్వాడ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, తల్లి రమాబాయి గృహిణి. నలుగురు తోబుట్టువులలో ఆయన చిన్నవారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన శివాజీరావు, చదువు తర్వాత అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS) లో బస్ కండక్టర్ గా పనిచేశారు. కండక్టర్‌గా పనిచేసేటప్పుడే ఆయన ప్రత్యేకమైన స్టైల్, టికెట్ ఇచ్చే పద్ధతి ప్రయాణికులను ఆకట్టుకునేవి. బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే, ఆయన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో యాక్టింగ్ డిప్లొమా కోర్సులో చేరారు. ఈ సమయంలో ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్ ఆర్థికంగా ఎంతగానో తోడ్పడ్డారు.
సినిమా ప్రవేశం
1975లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ లో రజనీకాంత్ చిన్న పాత్రలో నటించారు. బాలచందర్ సలహా మేరకే ఆయన తమిళం నేర్చుకున్నారు. తొలినాళ్లలో ఆయన ఎక్కువగా నెగెటివ్ పాత్రలు, సహాయ పాత్రలలో నటించారు. 1977లో వచ్చిన ‘భువన ఒరు కెల్వి కురి’, 1978లో వచ్చిన ‘ముల్లుమ్ మలరుమ్’ చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. 1980లో వచ్చిన ‘బిల్లా’ చిత్రం ఆయనకు యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది, ఇది భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. ఇంతటి అద్భుతమైన విజయం సాధించినప్పటికీ, రజనీకాంత్ తన సరళత, వినయం ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందారు. ఆయన తరచుగా హిమాలయాలను సందర్శిస్తారు. ఆయన జీవిత ప్రయాణం, కష్టపడే తత్వం భారతీయ పాఠశాలల్లో CBSE సిలబస్‌లో ‘ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్‌స్టార్’ అనే అధ్యాయంలో ఒక స్ఫూర్తిదాయక కథగా చేర్చబడింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి కి దేశ ప్రదాని మంత్రతో సైతం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేకత సంతరించుకుంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా పలువు ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Read also-Akhanda2 Review: బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’తో పూనకాలు తెప్పించారా?.. ఫుల్ రివ్యూ..
రజనీకాంత్ 75వ జన్మదినం అనే ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయనకు శుభాకాంక్షలు. ఆయన నటన ప్రతిభ అనేక తరాలను ఆకర్షించింది, విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ఆయన సినీ ప్రపంచపు సృష్టి అనేక పాత్రలు, శైలులలో విస్తరించి, చెరగని ముద్రను వేసింది. ఈ ఏడాది ఆయన చలనచిత్ర ప్రపంచంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక ముఖ్య అంశం. ఆయన నిండు నూరేళ్ల ఆరోగ్యకరమైన జీవితం కోసం నేను ప్రార్థిస్తున్నాను.అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
திரு ரஜினிகாந்த் அவர்களின் 75-வது பிறந்தநாள் எனும் சிறப்பான தருணத்தில் அவருக்கு வாழ்த்துகள். அவரது நடிப்பாற்றல் பல தலைமுறைகளைக் கவர்ந்துள்ளது; பரவலான பாராட்டைப் பெற்றுள்ளது. அவரது திரையுலகப் படைப்புகள் பல்வேறு பாத்திரங்கள் மற்றும் பாணிகளில் பரவி, தொடர்ச்சியான முத்திரைகளைப்…
— Narendra Modi (@narendramodi) December 12, 2025
Warmest birthday wishes to dear Rajinikanth Sir.
As you celebrate 50 remarkable years in cinema, thank you for inspiring generations with your values, strength, and extraordinary spirit.
May God bless you always with peace, good health, and boundless joy.@rajinikanth— Mohanlal (@Mohanlal) December 12, 2025
75 years of a remarkable life.
50 years of legendary cinema.
Happy birthday, my friend @rajinikanth. pic.twitter.com/4Lx5m7zfFw— Kamal Haasan (@ikamalhaasan) December 12, 2025
Wishing the one and only Superstar @rajinikanth Garu a glorious 75th birthday!
A milestone that celebrates not just age, but an extraordinary legacy.
Wishing you great health, joy, and endless blessings. ❤️🙏🏼#HBDSuperstarRajinikanth pic.twitter.com/7Zmn1JS1H4— Bobby (@dirbobby) December 12, 2025
Happy Birthday to the one and only Superstar @rajinikanth sir. A lifelong fan, I remain deeply grateful for the warmth and support you extended to our family during our most difficult times. Your grace, humility and aura continue to inspire generations. May the Superstar’s… pic.twitter.com/SgnzdHUYYY
— Lokesh Nara (@naralokesh) December 12, 2025
Wish you happy birthday 👑🎂🎂👑super star @rajinikanth sir 👏🤝🫂 pic.twitter.com/tNvfOR1guT
— Yogi Babu (@iYogiBabu) December 12, 2025

