Tejaswini Blunder: గుర్రం బాపిరెడ్డి సినిమా ప్రమోషన్లో భాగంగా రాజు ‘వెడ్స్ రాంబాయి’ ఫేమ్ తేజస్విని చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఇప్పుడు తెగ నవ్విస్తున్నాయి. తాజాగా గుర్రం బాపిరెడ్డి సినిమా డిసెంబర్ 19 విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రచారంలో కూడా వేగం పెంచింది. అదే క్రమంలో విద్యార్ధులతో జరిగిన ఓ ఈవెంట్ లో నటి తేజశ్విని అన్న మాటులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది అంటే గుర్రం బాపిరెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. ఓ సందర్భలో గేదెల బాపిరాజు సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మళ్లీ అదే తీరులో ‘గేదెల బాపిరెడ్డి’ అనడంతో పక్కనే ఉన్న దర్శకుడు అలర్ట్ అయ్యాడు వెంటనే తేజశ్విని దగ్గరకు వెళ్లి మన సినిమా పేరు గేదెల బాపిరెడ్డి కాదు.. గుర్రం బాపిరెడ్డి అని చెప్పడంతో ఆమె గొంతు సవరించుకుంది. ఈ సంఘటన అక్కడ ఉన్నవారందరినీ కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.. మీరు కూడా నవ్వాలనుకుంటే ఈ వీడియో చూసేయండి..
Read also-Rajinikanth Legacy: రజనీ కాంత్ సౌత్ ఇండియన్ సినిమా పవర్ హౌస్‌గా ఏలా మారారంటే?.. ఆ స్పెషాలిటీతోనే..

