Mahesh Kumar Goud: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారుల విజయంప్రజల విశ్వాసానికి నిదర్శనమని టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల–2025 తొలి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థులు ఘనవిజయం సాధించడంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ అభ్యర్థులే గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Also Read: Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్
ఈ విజయానికి ప్రధాన కారణం
ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో, పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేసిన విధానమే ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో, ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్‌కు మరింత అనుకూలంగా మారిందని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజాపాలన సంక్షేమం–అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, ప్రజా పాలన పట్ల ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు.

