Panchayat Elections: మెజార్టీ స్థానాల్లో హస్తం హవా.. పల్లెల్లో జోరు
Panchayat Elections ( image Credit: swetcha reporter)
Political News

Panchayat Elections: మెజార్టీ స్థానాల్లో హస్తం హవా.. పల్లెల్లో జోరుగా సాగిన పోలింగ్!

Panchayat Elections: తొలి విడత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్ధతు అభ్యర్ధులు హవా సృష్టించారు. ఫస్ట్ ఫేజ్ లో 3,834 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‌ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రిటర్నింగ్ ఆఫీసర్ల వివరాల ప్రకారం(రాత్రి 11.55 వరకు) 2229మంది కాంగ్రెస్ మద్ధతు అభ్యర్ధులు గెలవగా, బీఆర్ ఎస్ మద్ధతు నుంచి 1128 మంది విజయం సాధించారు. ఇక బీజేపీ మద్ధతు తో 181 మంది పాటు ఇతర పార్టీల మద్ధతు, ఇండిపెండెంట్లు కలిపి మరో 510 మంది గెలుపొందారు. అయితే ఈ ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అధికారికంగా ప్రకటించనున్నది. మెజార్టీ స్థానాల్లో హస్తం అభ్యర్ధులే విజయం సాధించడం విశేషం. వాస్తవానికి తొలి విడతలో 4,236 సర్పంచ్‌ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 396 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అంతేగాక 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం జరుగగా, తొలి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 12,690 మంది అభ్యర్థులు , 65,455 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు.

Also Read: Panchayat Elections: సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎంతమంది ఓటు వేశారో తెలుసా?

కొన్ని కీలక ఘటనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో  నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు గుండెపోటుతో మరణించిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి (50) బీఆర్ఎస్ మద్ధతుతో పోటీ చేసి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత గ్రామం వీర్లపల్లిలో బీఆర్ఎస్ మద్ధతు అభ్యర్ధి 130 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సీపీఎంకు లక్కీ డ్రాలో ఉప సర్పంచ్

కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో సీపీఎంకు లక్కీ డ్రాలో ఉప సర్పంచ్ వచ్చింది. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో తల్లిపై కూతురు గెలిచింది. తల్లి గంగవ్వకు బీఆర్ ఎస్‌ మద్ధతివ్వగా, కూతురు సుమలతకు కాంగ్రెస్ మద్ధతిచ్చింది. యాదాద్రిలో రాజంపేట్ మండలం లక్ష్మణ్లపట్ల గా గ్రామ సర్పంచ్ గా లక్కిడాలో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు ఒకే విధంగా 148 ఓట్లు పోలవడంతో లక్కిడ్రా తీశారు. మరోవైపు ఆదిలాబాద్ ఊట్నూర్ లింగోజిగూడ తండాలో జాదవ్ మాయ దంపతులు సర్పంచ్ ఉప సర్పంచ్ లుగా గెలిచారు. జడ్చర్ల లో ఎమ్మెల్యే అనిరుద్ద్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్ధి రేవంతి ఏకంగా 490 మెజార్టీతో గెలిచారు.

Also Read: Panchayat Elections: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ చొరవ.. ఆ 37 పంచాయతీల ఏకగ్రీవం రికార్డ్!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క