Panchayat Elections: సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు
Panchayat-Elections (image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Panchayat Elections: సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు.. ఎంతమంది ఓటు వేశారో తెలుసా?

Panchayat Elections: జిల్లాలో తొలివిడత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న 1,71,804 మంది ఓటర్లు

పోలింగ్ శాతం 87.96గా నమోదు

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: సంగారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో (Panchayat Elections) 87.96 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతగా సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట్, పటాన్‌చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాలలో గురువారం పోలింగ్ జరిగింది. ఈ ఏడు మండలాల్లో కలిపి 1,95,323 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,71,804 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 87.96 శాతం పోలింగ్ నమోదైంది.

Read Also- KTR Vs Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్‌‌కు సిద్ధమైన కోర్టు

మండలం వారీగా పోలింగ్ వివరాలు

సంగారెడ్డి మండలం
మొత్తం ఓటర్లు: 19,031
ఓటేసిన వారు: 16,224
పోలింగ్ శాతం: 85.25%

కంది మండలం
మొత్తం ఓటర్లు: 36,898
ఓటేసిన వారు: 31,381
పోలింగ్ శాతం: 85.05%

కొండాపూర్ మండలం
మొత్తం ఓటర్లు: 35,871
ఓటేసిన వారు: 32,189
పోలింగ్ శాతం: 89.74%

సదాశివపేట మండలం
మొత్తం ఓటర్లు: 41,016
ఓటేసిన వారు: 36,531
పోలింగ్ శాతం: 89.07%

పటాన్‌చహరు మండలం
మొత్తం ఓటర్లు: 12,998
ఓటేసిన వారు: 10,945
పోలింగ్ శాతం: 84.21%

గుమ్మడిదల మండలం
మొత్తం ఓటర్లు: 9,036
ఓటు వేసిన వారు: 8,086
పోలింగ్ శాతం: 89.49%

హత్నూర మండలం
మొత్తం ఓటర్లు: 40,473
ఓటేసిన వారు: 36,448
పోలింగ్ శాతం: 90.06.

Read Also- Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల సవాల్.. తల్లిని ఓడించిన కూతురు.. ఎక్కడంటే?

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పూర్తి

గద్వాల నియోజకవర్గంలో 86.77 శాతం పోలింగ్ నమోదు
గద్వాల, స్వేచ్ఛ:
జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. నాలుగు మండలాల్లోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ధరూర్ మండలంలో ఉదయం 9 గంటలకు 25.28 శాతం, 11 గంటలకు 56.74 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు మొత్తం 85.89 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. గద్వాల మండలంలో నిర్దేశిత సమయం ప్రకారం వరసగా 20.06, 47.93, 88.71 శాతం నమోదు కాగా, గట్టు మండలంలో 19.66, 51.61, 84.36 శాతం, కేటీ దొడ్డి మండలంలో 24.97, 65.88, 87.99 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క