Mowgli Producer: బండి సరోజ్ కామెంట్స్‌.. సెన్సార్‌కు నిర్మాత సారీ!
BSK and Vishwa Prasad (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mowgli Producer: సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌పై బండి సరోజ్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పిన నిర్మాత!

Mowgli Producer: సెన్సార్ ఆఫీసర్‌పై ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) విలన్ బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చేసిన వ్యాఖ్యలకు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో తమ సినిమాలో నటించిన బండి సరోజ్ కుమార్.. సెన్సార్ బోర్డు ఆఫీసర్ స్పందనలకు సంబంధించి అనుకోకుండా ఒక వ్యాఖ్య చేశారని, అది దురుద్దేశపూర్వకంగా చేసింది కాదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. తాము సెన్సార్ ప్రక్రియకు అత్యున్నత గౌరవం ఇస్తామని, కంటెంట్‌ను బాధ్యతాయుతంగా, నిబద్ధతతో నియంత్రించే బోర్డు పాత్రను తాము లోతుగా గౌరవిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ రావడం గురించి చెబుతూ.. సెన్సార్ బోర్డు ఆఫీసర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు చిత్ర నిర్మాత క్షమాపణలు కోరారు.

Also Read- Akhanda 2: ‘అఖండ 2’కు షాకుల మీద షాకులు.. టికెట్ల ధరల హైక్, ప్రీమియర్ అనుమతి జీవో వెనక్కి!

సెన్సార్ బోర్డుకు, ఆఫీసర్‌కు క్షమాపణలు

‘‘సెన్సార్ బోర్డులో అత్యంత సామర్థ్యం గల అధికారులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారని, వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతగానో విలువ ఇస్తాము. మా సినిమా నటుడు చేసిన వ్యాఖ్య కేవలం అనాలోచితంగా, అనుకోకుండా వచ్చిన మాట. తక్షణమే ఆ వ్యాఖ్యను అన్ని ప్రచురించబడిన కంటెంట్‌ల నుంచి ఉపసంహరించుకుంటుటూ.. ఈ దురదృష్టకర సంఘటనపై సెన్సార్ బోర్డుకు, సెన్సార్ ఆఫీసర్‌కు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము’’ అని లేఖలో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తమకు అందిస్తున్న నిరంతర సహకారం, మద్దతుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ప్రకటన ద్వారా, ఆ సంస్థ సెన్సార్ బోర్డు పట్ల తమ గౌరవాన్ని తెలియజేసింది.

Also Read- Annagaru Vostaru: ‘అన్నగారు వస్తారు’కు ‘అఖండ 2’ తరహా కష్టాలు.. చివరి నిమిషంలో వాయిదా!

అసలింతకీ బండి సరోజ్ కుమార్ ఏమన్నారంటే..

‘‘ఈ సినిమాకు నేను ఆకు విలన్నో.. లేదంటే విలన్నో కాదు.. యాంటీ హీరోని. ‘మాంగళ్యం’లో చూసిన దొరబాబు పాత్రని సెల్యులాయిడ్‌పై చూస్తే ఎలా ఉంటుందో, అదే ఫైర్, అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. ఈ పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్‌కు థ్యాంక్స్. ఇప్పుడు ప్రేక్షకులందరినీ నేను ప్రార్థిస్తున్నాను, కాళ్లు పట్టుకుని అడుగుతున్నాను. నన్ను గెలిపించండి. ఈ సినిమాకు మీరు పెట్టే ప్రతి టిక్కెట్టు కూడా, చాలా మందికి సమాధానం చెబుతుంది. మార్కెట్‌లో మనం సౌండ్ చేస్తాం. సినిమా టికెట్ కూడా రూ. 90 రూపాయలే. దయచేసి అందరూ కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాను చూడండి. ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ‘ఏ’ సర్టిఫికెట్ అంటే ఇందులో ఎటువంటి అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసర్ భయపడిపోయాడట. ఎవడ్రా వీడు.. వీడి పెర్ఫార్మెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లాగా నటించలేదు, నా ముందే అలాంటి కాప్ ఉన్నాడని భయపడ్డాడట. అందుకే ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చాడట. ఈ మాట దర్శకుడు సందీప్ రాజ్ నాతో చెప్పారు’’ అని బండి సరోజ్ కుమార్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క