Maoist Surrender: మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా మావోయిస్టులు ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఐపీఎస్ ఎదుట లొంగిపోయారు. వారికి పునరావాస ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఎస్పీ అందించారు. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరుకన్నా ఊరు మిన్న” (మన ఊరికి తిరిగి రండి) అనే అవగాహన కార్యక్రమం, అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై మావోయిజాన్ని విడిచి ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఈ ఇద్దరు మహిళా సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.
Also Read: Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. మరో కీలక నేత లోంగుబాటు..?
స్వచ్ఛందమైన జీవితం గడిపేందుకు మొగ్గు
ఎస్పీ అందించిన వివరాల ప్రకారం, జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ములుగు జిల్లాలో మొత్తం 87 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో కిందిస్థాయి క్యాడర్లు నాయకత్వంపై అసంతృప్తితో రహస్య జీవితం వదిలి, కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితం గడపాలనే ఉద్దేశంతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని, దీనికి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో పని చేసే వారు లొంగిపోతున్నట్లు చెప్పారు. వారికి నగదు రివార్డు, వైద్య సేవలు, పునరావాస సహాయం
లొంగిపోయిన వారిలో
మడకం మల్లి (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, చింతల్ నార్ పోలీస్ స్టేషన్ పరిధి, జబ్బగట్ట గ్రామానికి చెందినవారు. ఓఎం రామే (బీజాపూర్ జిల్లా, గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి, జోజూరు గ్రామానికి చెందినవారు)
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఏకంగా 37 మంది లొంగుబాటు.. డీజీపీ కీలక ప్రకటన

