Sandeep Raj: యువ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) రూపొందించిన ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) చిత్రం విడుదల తేదీ వాయిదా నేపథ్యంలో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై వచ్చిన విమర్శలకు తాజాగా గట్టి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ డిసెంబర్ 12కు వాయిదా పడటంతో, డిసెంబర్ 12న రావాల్సిన ‘మోగ్లీ 2025’ను ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో, సందీప్ రాజ్ పడిన ఒత్తిడి, ఆవేదనతో చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన పోస్ట్‌కు వచ్చిన విమర్శలు, ముఖ్యంగా ‘సింపతీ గేమ్’ ఆడుతున్నారనే నెటిజన్ల కామెంట్స్‌పై సందీప్ రాజ్ స్పందించారు. ఒక నెటిజన్‌కు బదులిస్తూ.. ‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఎవరిపైనా ఎటువంటి సింపతీ డ్రామా క్రియేట్ చేయాలని అనుకోలేదు’ అని ఆయన గట్టిగా తెలిపారు.
Also Read- Akhanda 2 Thaandavam: తెలంగాణలోనూ టికెట్ల పెంపు, ప్రీమియర్‌కు అనుమతి.. వివరాలివే!
ఆ ఆవేదనతో ట్వీట్ చేశాను
నిజానికి, డిసెంబర్ 12న విడుదల కావాల్సిన మా చిత్రాన్ని భారీ సినిమాల వాయిదాల కారణంగా ఫిబ్రవరి లేదా ఏప్రిల్ 2026కు తరలించాలని అనుకున్నట్లుగా.. మాకు డిసెంబర్ 9 ఉదయం సమాచారం వచ్చిందని సందీప్ రాజ్ వివరించారు. ఈ వార్త వినగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, తమ భవిష్యత్తు గురించి ఆవేదనతో ట్వీట్ చేశానని తెలిపారు. అయితే, రోజు గడిచే కొద్దీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించి, సినిమాను అంత దూరం తీసుకెళ్లకుండా, మంచి విడుదల తేదీని ఖరారు చేయాలని నిర్ణయించారు. కానీ క్రిస్మస్, సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల కానుండటంతో తమకు వేరే మార్గం లేకపోయిందని సందీప్ అన్నారు. అందుకే డిసెంబర్ 13ను విడుదల తేదీగా ఖరారు చేశామని స్పష్టం చేశారు.
Also Read- Ravi Teja BMW: అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. మెలోడీతో వచ్చిన మాస్ మహారాజా!
ఇండస్ట్రీ మద్దతు, విమర్శలు
సందీప్ రాజ్ తొలి పోస్ట్‌కు సినిమా ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ లాంటి వారి నుంచి భారీ మద్దతు లభించింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం దీనిని నెగెటివ్‌గా చూడటంతో, ‘‘నేను ఇప్పుడు అస్సలు సంబరాలు చేసుకోవడం లేదు. నాకు వీలైనంత వరకు అందరి మద్దతు కావాలి, ఎవరి నుంచి విమర్శలు ఎదుర్కోవాలని అనుకోవడం లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అఖండ2’ (Akhanda 2) సినిమాపై నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు నా ఇంటర్వ్యూలలో కూడా అది చూడవచ్చు. దయచేసి నా మాటల అర్థాన్ని మార్చి మాట్లాడటం ఆపాలని నేను కోరుకుంటున్నానంటూ సందీప్ రాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిన్న సినిమాలకు విడుదల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సంఘటన మరోసారి తెరపైకి తెచ్చిందని భావించవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు ‘మోగ్లీ’ టీమ్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

