Akhanda 2 Thaandavam: తెలంగాణలోనూ అనుమతి వచ్చేసింది
Akhanda 2 Movie Still (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 Thaandavam: తెలంగాణలోనూ టికెట్ల పెంపు, ప్రీమియర్‌కు అనుమతి.. వివరాలివే!

Akhanda 2 Thaandavam: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) విడుదల విషయంలో ఏర్పడిన అడ్డంకులను దాటుకుని మూవీని డిసెంబర్ 12 విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల హైక్, ప్రీమియర్‌కు అనుమతులు ఇస్తుందా? లేదా? అనేలా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో.. ఆ అనుమానాలకు తెరదించుతూ అనుమతులు వచ్చేశాయి. డిసెంబర్ 5న సినిమా విడుదల నిమిత్తం విడుదల చేసిన జీవోను సవరించి డిసెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాకు, అందులో ఏమయితే అనుమతులు జారీ చేశారో.. ఇందులోనూ ఇవే ఇచ్చారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు, అలాగే ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతులు రావడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఫైనల్‌గా రావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Akhanda 2: రిలీజ్‌కు ముందు మరో టీజర్ వదిలారు.. ఈ టీజర్ ఎలా ఉందంటే?

ప్రీమియర్ షో, టికెట్ ధరల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం, డిసెంబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక ప్రీమియర్ షోను ప్రదర్శించుకోవడానికి చిత్ర బృందానికి అవకాశం దక్కింది. ఈ ప్రత్యేక ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ. 600గా ప్రభుత్వం నిర్ణయించింది. భారీ అంచనాలు ఉన్న సినిమా కావడంతో, రికార్డు కలెక్షన్ల దిశగా ఈ ప్రీమియర్ షో దోహదపడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ రోజుల్లో టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు, అంటే డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయి. ఈ మూడు రోజుల్లో మల్టీప్లెక్సులలో టికెట్ ధరపై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై అదనంగా రూ. 50 చొప్పున పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీలోనూ పెరిగిన ధరలు

‘అఖండ 2: తాండవం’ టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతులు సినిమా తొలిరోజు వసూళ్లపై, ఓపెనింగ్స్ రికార్డులపై భారీ ప్రభావం చూపనున్నాయి. సినిమా విడుదలకు క్లియరెన్స్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేయడం విశేషం.

Also Read- Save the Tigers Season 3: టైగర్స్ వస్తున్నారు.. ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ గ్లింప్స్ చూశారా?

భారీ స్థాయిలో అంచనాలు

గతంలో వచ్చిన ‘అఖండ’ సృష్టించిన సునామీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ బజ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు అదనపు టికెట్ రేట్లకు, ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడం ద్వారా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ‘తాండవం’ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. బాలకృష్ణ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌ను, బోయపాటి మార్క్ మాస్‌ను పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!