KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు స్వయంగా బీమా చేయించి.. వాటి తాలూకు బాండ్లను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ఆటో డ్రైవర్లకు బాకీ ఉన్న రూ.1560 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును సైతం ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో మహాధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత అక్టోబర్ నుంచి ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా రద్దయిందన్న కేటీఆర్.. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు భరించలేక 93 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియో, ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.15 వేలు ప్రభుత్వం చెల్లించాలని పట్టుబట్టారు.
Also Read: Vijay Sethupathi: కింగ్ నాగార్జున వయసుపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
మరోవైపు ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అనుబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ముందుండి పోరాడారని అన్నారు. తెలంగాణ కావాలంటూ కేసీఆర్ (KCR) కు మద్దతుగా ర్యాలీల నిర్వహించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్మికుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మంది కార్మికులకు ఉచిత బీమా కల్పించినట్లు గుర్తుచేశారు.
✳️ రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. భారీ సంఖ్యలో పాల్గొన్న జిల్లాలోని ఆటోడ్రైవర్ లు.
ఈ సందర్భంగా కేటీఆర్… pic.twitter.com/D7rj72yHcD
— BRS Party (@BRSparty) December 10, 2025

