Nayanam: నెరేషన్ విన‌గానే షాకింగ్‌లో ఉండిపోయా- వరుణ్ సందేశ్
Nayanam Web Series (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nayanam: నెరేషన్ విన‌గానే షాకింగ్‌లో ఉండిపోయా.. ‘నయనం’పై వరుణ్ సందేశ్

Nayanam: ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న జీ 5 ఓటీటీ (Zee 5).. మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించేందుకు సిద్ధమైంది. అదే ‘న‌య‌నం’ (Nayanam). వ‌రుణ్ సందేశ్‌ (Varun Sandesh), ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఒరిజిన‌ల్ సిరీస్ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్ల‌ర్‌‌కు స్వాతి ప్ర‌కాశ్ (Swathi Prakash) డైరెక్టర్. డిసెంబర్ 9, మంగళవారం హైదరాబాద్‌లో ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌కు అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు.

Also Read- Akhanda 2: ఎట్టకేలకు ‘అఖండ 2’ విడుదల తేదీ చెప్పిన మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్స్‌పీరియెన్స్ చేయని పాయింట్

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జీ తెలుగు అండ్ తెలుగు జీ5 వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ.. వెబ్ సిరీస్‌ల సక్సెస్‌ఫుల్ జర్నీలో జీ 5 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. స్వాతి స్టోరీ చెప్పగానే ఫస్ట్ టైమే అందరికీ నచ్చింది. మంచి క్వాలిటీ ప్రాజెక్ట్ వచ్చింది. డిసెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. తెలుగు ఒరిజినల్ కంటెంట్, తెలుగు జీ5 వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశరాజ్ మాట్లాడుతూ.. ఎప్పుడూ మంచి కంటెంట్‌తో మీ ముందుకు వ‌స్తూనే ఉన్నాం. ఈసారి కూడా మంచి కంటెంట్‌తో పాటు యూనిక్ కంటెంట్‌తోనూ వ‌స్తున్నాం. తెలుగు ఓటీటీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్స్‌పీరియెన్స్ చేయ‌ని ఒక డిఫ‌రెంట్ పాయింట్‌తో వ‌స్తున్నాం. దీంతో 2025 ఎండింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. ప‌ది రోజుల గ్యాప్‌తో జీ5లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌స్తున్నాయి. ఒక‌టేమో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇంకోటి న‌య‌నం. 2026 కూడా మంచి లైన‌ప్ ఉంది. వ‌రుణ్ సందేశ్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. పోలీస్ క్యారెక్ట‌ర్‌లో అలీ రెజా సూప‌ర్బ్‌గా న‌టించారు. త‌న పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందని తెలిపారు. చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అండ్ బిజినెస్ హెడ్, తెలుగు జీ5 అనురాధ గూడూరు మాట్లాడుతూ.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’తో సంగీత్ శోభ‌న్‌ను మా ఫ్లాట్‌ఫామ్‌తోనే లాంచ్ చేశాం. త‌న కెరీర్ గ్రాఫ్ చాలా బాగుంది. స్వాతి ఈ స్క్రిప్ట్‌తో మ‌మ్మ‌ల్ని క‌లిసిన‌ప్పుడు ఆమె ప్యాష‌నేట్‌తో అంద‌రినీ ఎగ్జ‌యిట్ చేసింది. ఇది సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌. న‌టీన‌టులంద‌రూ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఎస్ఆర్‌టీ టీమ్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చింది. భ‌విష్య‌త్తులోనూ మంచి కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తాం. ఇప్పటి స‌మాజానికి స‌రిపోయే కంటెంట్ ‘నయనం’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Ustaad Bhagat Singh: ‘స్టెప్ ఏస్తే భూకంపం’.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప్రోమో అదిరింది

ఒక మంచి ప్రాజెక్ట్ చేశాన‌నే శాటిస్పాక్ష‌న్‌తో..

హీరో వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఫస్ట్ శేఖర్ ఈ స్టోరీ గురించి చెప్పారు. స్వాతి, సాధిక‌ ఇచ్చిన నెరేషన్ విన‌గానే షాకింగ్‌లో ఉండిపోయా. ఏం ఆలోచించ‌కుండా ఎలాగైనా ఈ పాత్ర చేయాల‌ని డిసైడ్ అయిపోయాను. జీ5 టీమ్ ఇలాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్ష‌కుల‌కు తీసుకువ‌స్తుండ‌టం గొప్ప విష‌యం. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్‌, రజినీ‌లకు థ్యాంక్స్‌. చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ చేశాన‌నే శాటిస్పాక్ష‌న్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. డిసెంబ‌ర్ 19 ఎప్పుడొస్తుందా.. ప్రేక్ష‌కులు ఈ ‘న‌య‌నం’ను ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అలీరెజా, ప్రియాంక‌, రేఖ .. ఇలా అంద‌రూ ఇందులో అద్భుతంగా న‌టించారు. అజ‌య్‌ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌.. షోయ‌బ్ విజువ‌లైజేష‌న్‌ను స్క్రీన్‌పై చూడటానికి ఎంతగానో వెయిట్ చేస్తున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాట్లాడారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!