Bomb Threat: లోక్ భవన్‌కు సైతం బెదిరింపు ఈ-మెయిల్
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడా
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బాంబు బెదిరింపులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. మంగళవారం నాడు వాసుకి ఖాన్ అనే పేరుతో ఏకంగా లోక్ భవన్‌కు (రాజ్ భవన్) బెదిరింపు మెయిల్ వచ్చింది. లోక్ భవన్‌తోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చివేయడానికి కుట్ర జరుగుతోందని మెయిల్‌లో పేర్కొన్నారు. ఇక, శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టుకు కూడా మరో బాంబు బెదిరింపు వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామంటూ అగంతుకులు బెదిరింపు మెయిల్ పంపించారు. జాస్పర్ పకార్ట్ అనే పేరు మీద న్యూయార్క్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ భయం జనాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇటీవలే డజనుకు పైగా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తాజాగా లోక్ భవన్‌కు వాసుకి ఖాన్ పేరిట వచ్చిన మెయిల్ మరోసారి పోలీసుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది.
Read Also- BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు
ఆ మెయిల్‌లో లోక్ భవన్‌తోపాటు సీఎంవోలో పేలుళ్లు జరపటానికి కుట్రలు జరుతున్నాయని అగంతకుడు పేర్కొన్నాడు. వెంటనే వీఐపీలు, ప్రముఖులను భవనాల నుంచి ఖాళీ చేయించాలని రాసుకొచ్చాడు. వెంటనే గవర్నర్ కార్యాలయం అలర్ట్ అయ్యింది. గవర్నర్ ఆఫీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ బెదిరింపు మెయిల్‌పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలియగానే పోలీసు జాగిలాలను తీసుకుని లోక్ భవన్, సీఎంవోలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంగుళం అంగుళం తనిఖీ చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు కనిపించక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also- Kamalapuram: ఆ గ్రామం రాష్ట్రానికే ఆదర్శం.. ఊరంతా ఒక్కటయ్యారు.. యూత్ చొరవతో జీపీ ఏకగ్రీవం!
అమెరికా నుంచి బెదిరింపు మెయిల్…
ఇక, మంగళవారం మరోసారి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టినట్టుగా అగంతకుడు మెయిల్ లో పేర్కొన్నాడు. వాటిని పేల్చకుండా ఉండాలంటే తనకు మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే బాంబులను పేల్చి వేస్తానని బెదిరించాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అమెరికా వెళుతున్న అన్ని విమానాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. దాంతోపాటు ఎయిర్ పోర్టులో కూడా సోదాలు జరిపారు. దీంట్లో ఎక్కడా పేలుడు పదార్థాలు కనిపించ లేదు. కాగా, ప్రాథమిక విచారణలో జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి పేర న్యూయార్క్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టుగా వెల్లడైంది. దీనిపై ఆర్జీఐఏ పోలీసులు కేసులు నమోదు చేపి దర్యాప్తు ప్రారంభించారు.

