Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి
Seethakka ( image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి జరగడం ఖాయం : మంత్రి ధనసరి సీతక్క

Seethakka: గ్రామపంచాయతీలో యువనాయకత్వంతో అభివృద్ధి జరగడం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్, రొయ్యూరు, ములకట్ట గ్రామాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులు, గుడ్ల శ్రీలత, గద్దల నవీన్, నాగలక్ష్మి, కావీరి అర్జున్, ఈసం జనార్ధన్ తరపున మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధినీ చూసి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, గ్రామంలో ఎలాంటి పనులు ఉన్న వాటిని కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థిని గెలిపించి గ్రామాభివృద్ధిలో సహకరించాలని గ్రామస్థులను మంత్రి సీతక్క కోరారు. రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరున దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు బారులు తీరుతున్నారని చెప్పారు.

Also Read: Seethakka: దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు.. దీని వెన‌క ఆంత‌ర్యం ఎంటి? మంత్రి సీతక్క ఫైర్!

ప్రతి అభ్యర్థిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి

రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తొలి స్థానంలో ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషి రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: Minister Seethakka: ఆ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించండి.. మంత్రి సీతక్క అభ్యర్థన

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?