Viral Video: పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.. భర్తతో ఉండగా భార్య ఎంట్రీ
Viral Video (Image Source: twitter)
Viral News

Viral Video: పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.. భర్తతో ఉండగా భార్య ఎంట్రీ.. యువతి చేసినదానికి అంతా షాక్!

Viral Video:  వివాహేతర సంబంధాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. జీవిత భాగస్వామిని కాదని పరాయి వ్యక్తులతో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. తాజాగా చైనాలోనూ ఓ యువతి.. పెళ్లైన మగవ్యక్తితో వివాహేతర బంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో 10 అంతస్తుల ఎత్తులో ఉన్న అతడి ఫ్లాట్ కు సైతం ఆమె వెళ్లింది. ఈ క్రమంలో ప్రియుడి భార్య సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె చేసిన పని.. నెట్టింట విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో గల ఓ బహుళ అంతస్తు భవనంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఓ మహిళ 10 అంతస్తుల ఎత్తులో ఉన్న ఓ ఇంటి కిటికీ నుంచి ప్రమాదకర స్థితిలో బయటకు రావడాన్ని చూడవచ్చు. కిటికీ అంచు నుంచి డ్రెయిన్ పైపుల వద్దకు చేరుకొని అక్కడ నుంచి నెమ్మదిగా కిందకి చేరేందుకు యువతి ప్రయత్నిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

డ్రెయిన్ పైపుల గుండా..

యువతి కిటికీ గుండా బయటకు వస్తున్న క్రమంలో ఇంట్లో షర్ట్ లేకుండా ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెకు సాయం చేస్తున్నాడు. నవంబర్ 30న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రెయిన్ పైపుల గుండా పక్కింటి కిటికీ వద్దకు చేరిన సదరు యువతి.. కిటికీని తడుతూ లోపలి వారి సాయం కోరడం వైరల్ వీడియోలో గమనించవచ్చు. వైరల్ అవుతున్న వీడియోపై అక్కడి స్థానిక మీడియా స్పందించింది. 10వ అంతస్తులోని ఇంట్లో ప్రేయసితో భర్త ఉండగా.. భార్య సడెన్ ఎంట్రీ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో భయపడి కిటికీల గుండా ప్రేయసిని అతడు బయటకు పంపాడని తెలిపింది.

Also Read: IND vs SA 1st T20I Prediction: నేడే తొలి టీ-20.. సౌతాఫ్రికాను భారత్ ఓడిస్తుందా.. గత రికార్డ్స్ ఏం చెబుతున్నాయ్!

నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆమె స్పైడర్ మ్యాన్ కుటుంబ సభ్యురాలని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘బిగ్ ట్విస్ట్.. చివర్లో ఆమెను లోపలికి తీసుకున్న వ్యక్తి ప్రియుడి భార్య కావొచ్చు’ అని పేర్కొన్నారు. అయితే ఇది ఆమెకు కొత్త అనుభవంలాగా కనిపించడం లేదని ఇంకో వ్యక్తి రాసుకొచ్చారు. ఇంకొక యూజర్ ‘అలాంటి ప్రియుడి కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టకండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి’ అని కామెంట్ చేశారు. మెుత్తంగా ఈ వీడియో పోస్ట్ అయిన గంట వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ రావడం గమనార్హం.

Also Read: Champion Song: రోషన్ ‘ఛాంపియన్’ నుంచి ‘సల్లంగుండాలి’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి మరి..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?