Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?
Bigg Boss Telugu 9 (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: సంజన జైలుకి, తాత్కాలిక కెప్టెన్‌గా భరణి.. నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 92వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 92).. హౌస్‌మేట్స్‌ని చాలా కఠినమైన పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. ఇప్పటికే విడుదలైన ప్రోమోలలో ఓ ఆసక్తికరమైన టాస్క్ ఆడించిన బిగ్ బాస్.. అందులో సంజన (Sanjjanaa)ను జైలుకు పంపించారు. టాస్క్‌లో సంజన మినహా అందరికీ రేటు కార్డు పడింది. కానీ సంజనకు జీరో రేటు కార్డు దొరకడంతో, ఆమెను బిగ్ బాస్ జైలులో పడేశారు. జైలులో కూడా ఆమెకు ఓ టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ టాస్క్ అనంతరం, ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడాలంటే మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చెబుతూ.. అందుకు ఓ అవకాశం ఇస్తున్నానని ‘స్వింగ్ జర’ అనే టాస్క్‌ని హౌస్‌మేట్స్కి బిగ్ బాస్ ఇచ్చారు. సంజన జైలులో ఉండటంతో, ఆమె ఈ టాస్క్‌లో ఎక్కడా కనిపించలేదు. అలాగే ఆల్రెడీ టాప్ 1 ఫైనలిస్ట్‌గా ఉన్న కళ్యాణ్ (Kalyan) కూడా ఈ టాస్క్ ఆడటం లేదు. అతనే ఈ టాస్క్ సంచాలక్‌గా నిర్ణయిస్తున్నట్లుగా తాజాగా వచ్చిన ప్రోమో తెలియజేస్తుంది. ఈ ప్రోమోని గమనిస్తే..

Also Read- Bandi Saroj Kumar: కొంచమైనా బాధ్యత ఉండాలిగా.. ‘అఖండ 2’ నిర్మాతలపై ‘మోగ్లీ’ విలన్ ఫైర్!

ఇమ్యునిటీని ఇచ్చే ‘స్వింగ్ జర’

‘‘ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ మీ ప్రయాణంపై నియంత్రణ తీసుకుని, ఈ నామినేషన్స్ (Nominations Task) నుంచి బయటపడి ఫైనలిస్ట్‌గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశం నేను మీకు ఇస్తున్నాను. టాప్ 1గా నిలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యునిటీ పొందే అవకాశం ఉంది. పోటీ దారులకు ఇస్తున్న మొదటి యుద్ధం ‘స్వింగ్ జర’. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా.. తమకు కేటాయించిన మూడు బ్లాంక్స్‌కి హ్యాంగ్ అవుతున్న బాల్స్‌ని హ్యాండిల్ ద్వారా కదుపుతూ.. బ్లాంక్‌లోని స్లాట్‌లో పడేలా చేయాలి’’ అని చెప్పారు. ముందు ఒకటి, తర్వాత రెండు, ఆ తర్వాత మూడు బాల్స్‌తో ఉన్న బ్లాంక్స్‌ కనిపిస్తున్నాయి. తనూజ రెండో దాని దగ్గర ఇబ్బంది పడుతున్నట్లుగా చూపించారు. ఇమ్మానుయేల్ 3 బాల్స్ దగ్గర ఆడుతున్నాడు. అంటే, అతను ఒకటి, రెండు ఫినిష్ చేసి మూడో స్థానానికి చేరుకున్నాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనేది మాత్రం బిగ్ బాస్ రివీల్ చేయలేదు.

Also Read- Anil Ravipudi: చిరుకి కథ నచ్చకపోవడంతో.. వెళ్తున్నానని చెప్పకుండానే జారుకున్నా!

కన్నింగ్ స్ట్రాటజీని వాడితే ఔట్..

ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అనూహ్యంగా రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. హౌస్‌మేట్స్‌కు స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఎవరైతే కన్నింగ్ స్ట్రాటజీని వాడతారో, ఆడుతారో.. అలాంటి వాళ్లను ప్రేక్షకులు చూస్తూ ఊరుకోరనే మెసేజ్‌ని రీతూ ఎలిమినేషన్‌తో ఇచ్చినట్లయింది. ఇకపై హౌస్‌మేట్స్ అందరూ చాలా జాగ్రత్తపడాలి. ఆదివారం జరిగిన ఎలిమినేషన్‌తో.. ఇప్పటి వరకు టాప్ 5 ఆర్డర్ కూడా మారిపోయింది. వాస్తవానికి ఈ వారం సుమన్ శెట్టి వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, తనూజతో జరిగిన నీళ్ల ట్యాంక్ టాస్క్‌లో సుమన్ శెట్టి తీరు ప్రేక్షకులని కదిలించింది. దీంతో అందరూ గుద్దిపడేశారు. దీంతో ఈ వారం సుమన్ శెట్టి సేఫ్ అయ్యాడు. ఈ సోమవారం నామినేషన్స్‌లో ఫైర్ లేదు కానీ, అందరూ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో భరణి తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం