Bandi Saroj Kumar: టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే.. అందరూ చెప్పే మాట ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల ఎప్పుడు? అనే. ‘అఖండ 2’ మూవీ విడుదల తేదీ చుట్టూ అలుముకున్న గందరగోళమే.. సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థపై నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్‌లోకి ప్రముఖ నటుడు, ‘మోగ్లీ 2025’ చిత్రంలో విలన్‌గా (Mowgli) మెప్పించిన బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) కూడా చేరాడు. అవును, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నిద్రలు లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు
తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ సంస్థను ఉద్దేశించి ‘Most irresponsible behaviour from @14ReelsPlus’ అంటూ ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, డిసెంబర్ 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీనీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు. చెడ్డ పేరు తప్ప. బాధ్యత ఉండాలిగా.. #Akhanda2 release date ???’’ అంటూ నిర్మాతల తీరును దుయ్యబట్టారు.
Also Read- Avatar Fire and Ash: ‘అవతార్’లో తెలియకుండానే ఇండియన్ కనెక్షన్.. ఇది గమనించారా?
గందరగోళంలో డిసెంబర్ 12న రావాల్సిన చిత్రాలు
డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ‘అఖండ 2’ చిత్రం.. చివరి నిమిషంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుందో తెలియంది కాదు. ప్రస్తుతం ఈ సినిమాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినప్పటికీ.. రిలీజ్ డేట్‌ని ప్రకటించడం లేదు. డిసెంబర్ 12న రిలీజ్ అంటూ కొన్ని లీక్స్ అయితే వినిస్తున్నాయి. దీంతో.. నిర్మాతల్లో నెలకొన్న సందిగ్ధత, సరైన సమయంలో అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు, అలాగే ఈ సినిమా తేదీ కారణంగా తమ విడుదల తేదీలు మార్చుకున్న చిన్న చిత్రాలకూ ఈ ఆలస్యం పెద్ద నష్టాన్ని, గందరగోళాన్ని సృష్టించింది.
Most irresponsible behaviour from @14ReelsPlus
ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీ నీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం…— Saroj (@publicstar_bsk) December 8, 2025
Also Read- Anil Ravipudi: చిరుకి కథ నచ్చకపోవడంతో.. వెళ్తున్నానని చెప్పకుండానే జారుకున్నా!
ప్రమోషన్స్ మొత్తం వేస్టేనా?
ఎలాగూ ఆలస్యమైంది కాబట్టి.. ఈ నెలలో మంచి డేట్ చూసుకుని విడుదల చేస్తే సరిపోతుంది. అలా కాకుండా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న డిసెంబర్ 12 అంటే.. నిజంగా అభిమానులకు కూడా గందరగోళాన్ని తలపిస్తుంది. ఈ సినిమా వస్తుందా? రాదా? అనే డౌట్ కూడా వారిలో ఉంది. అలాంటప్పుడు టికెట్స్ కూడా తెగవు కాబట్టి.. ఈ శుక్రవారం కాకుండా, తర్వాత శుక్రవారానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, ఇండస్ట్రీ పెద్దలు కూడా సూచన చేస్తున్నారట. మరోవైపు ‘మోగ్లీ’ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఒకవేళ ‘అఖండ 2’ వస్తే ఆ సినిమా రిలీజ్‌ను ఆపేస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ మొత్తం వేస్ట్ అయిపోతుందని, బండి సరోజ్ కుమార్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

