Contractor Murder: బీజాపూర్‌లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీ(Inthiyaz Ali)ని మావోయిస్టులు ఆదివారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఇరాపల్(Erapally)లికి ఓ వ్యక్తితో చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టినట్లుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ఇంతియాజ్ అలీ ని కిడ్నాప్ చేసినట్లుగా కూడా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్(SP Jitendra Kumar Yadav) ధ్రువీకరించారు. ఈ ఘటన పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే దారుణంగా ఇంతియాజ్ అలీని మావోయిస్టులు దారుణంగా కొట్టడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
రోడ్డు కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు
కాంట్రాక్టర్ సహచర వ్యక్తి శిబిరం నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే మృతి చెందిన ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంతియాజ్ అలీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కాంట్రాక్టర్ గా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఇంతియాజ్ అలీ ని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టడంతో మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయొద్దని కారణంతో మావోయిస్టులు కాంట్రాక్టర్ ను పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ అభివృద్ధి పనులు కొనసాగిస్తుండడంతో ఆగ్రహించిన మావోయిస్టులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. దీంతో కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ మృతి చెందాడు. ఈ ఘటనతో ఇరాపల్లి ప్రాంతంలో కలకలం రేగింది.
Also Read: Hoti Basavaraj: సంగారెడ్డి జిల్లాలో ఓ కళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం..!

