Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిన హౌస్ మేట్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. సుమన్, డిమోన్ పవన్ , కళ్యాణ్, భరణి, ఇమ్మానుయేల్, సంజన, తనూజ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు వారిలో ఒక్కరు కూడా ఇంట్లో నిలవలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా వెళ్లిపోయారు. అసలు ఆ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎందుకు పెట్టారో బిగ్ బాస్ కే తెలియాలి. కానీ, ప్రతి సీజన్స్ లా ఈ సీజన్ అసలు లేదు. జంటలుగా ఇంట్లోకి పంపించారు. కానీ, అనుకున్న రీతిలో ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్ అయితే దొరకలేదనే చెప్పుకోవాలి. ఇది మాత్రమే కాకుండా కామనర్స్ అని చెప్పి వారిని ఇంట్లోకి తెచ్చారు. వారిలో ఇద్దరూ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేశారో లేక ఇంట్లోనుంచి పంపించేసారో కూడా అర్థం కాలేదు.
అయితే, తాజాగా డే 92 ప్రోమోను విడుదల చేసారు. అయితే, ఈ ప్రోమోలో మళ్ళీ బిగ్ బాస్ కొత్త టాస్క్ పెట్టాడు. మీలో ప్రతి యొక్కరు ఈ బిగ్ బాస్ సీజన్ ప్రయాణంలో మీ ముద్ర వేశారు. గొప్పగా మార్చడంలో మీ వంతు కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని నెంబర్స్ తో కొలిచే టైం వచ్చేసింది. మీ ముందు ఆరు బాక్స్ లు ఉన్నాయి. ఆ బాక్స్ లో ఉన్న పాయింట్స్ ప్రతి యొక్కరు కాంట్రిబ్యూషన్ అనేది సూచిస్తాయి. మీరు ప్రతి యొక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశ పై నేరుగా ప్రభావం చూపుతాయని బిగ్ బాస్ ను టాస్క్ ను వివరించాడు.
బిగ్ బాస్ ఇంట్లో నున్న హౌస్ మేట్స్ బాల్ ను పట్టుకుని మిగతా హౌస్ మేట్స్ ని నెంబర్స్ తో కొలిచి చెబుతున్నారు. మొదటిగా డిమోన్ పవన్ పట్టుకోగా .. నేను మీకు 1 లక్ష పాయింట్స్ ఇద్దామని అనుకుంటున్నాను అంటూ మొదలు పెట్టాడు. చూడబోతుంటే ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య పెద్ద చిచ్చే పెట్టడానికే పెట్టినట్లు ఉంది. ఎవరూ ఎన్ని పాయింట్స్ ఇచ్చారో తెలియాలి అంటే ఈ రోజు రాత్రి పది గంటల వరకు వేచి చూడాల్సిందే.

