Ramachandra Rao: హైదరాబాద్‌కు వస్తే.. మీ గోరీ కడతాం
Ramachandra Rao (imagecredit:twitter)
Political News, Telangana News

Ramachandra Rao: హైదరాబాద్‌కు వస్తే.. మీ గోరీ కడతాం: రాంచందర్ రావు

Ramachandra Rao: పశ్చిమబెంగాల్‌లో బాబ్రీ మసీదు(Babri Masjid) తరహాలో కట్టడం నిర్మిస్తామని తృణమూల్ కాంగ్రెస్ సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్9Humayun Kabir) ఇటీవల ప్రకటించిన క్రమంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అన్ని సౌకర్యాలతో బాబ్రీ స్మారకం నిర్మిస్తామని హైదరాబాద్‌(Hyderabada)కు చెందిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్ సంస్థ ప్రకటించింది. కాగా దీనిపై మహాధర్నా వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) ఘాటు విమర్శలు చేశారు. బాబ్రీ స్మారకం కడుతానని చెప్పిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్ సంస్థ ప్రతినిధి హైదరాబాద్ లో అడుగుపెడితే ఆయన గోరీ కడుతామని హెచ్చరించారు.

రాష్ట్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం

తీవ్రవాదులను, అర్బన్ నక్సలైట్లను పెంచి పోషించేది కాంగ్రెస్(Congress) పార్టీయేనని మండిపడ్డారు. తుపాకులు వదలాలని నక్సలైట్లకు సమయమిచ్చామని, తుపాకులు వదలకపోతే హిడ్మాకు పట్టిన గతే వారికీ పడుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలపై చేపట్టిన ఉద్యమం ఇక్కడితో ఆగదని, కాంగ్రెస్ ను గద్దె దించేంత వరకు కొనసాగుతుందన్నారు. రేవంత్(Revanth) సర్కార్ వచ్చాక రాష్ట్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయిందన్నారు. పదేండ్లు.. సీఎం, సన్స్ పాలన సాగితే.. కాంగ్రెస్ వచ్చాక సీఎం.. బ్రదర్స్ పాలన సాగుతోందని ఎద్దేవాచేశారు. తమకు మూడు కోట్ల దేవతలుంటే.. కాంగ్రెస్ కు సోనియా, ప్రియాంక, రాహుల్ ముగ్గురు దేవుళ్లు మాత్రమే ఉన్నారంటూ రాంచందర్ రావు చురకలంటించారు. ఈ ధర్నాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాలేదని తప్పుడు వార్తలు రాయొద్దని, ఇది తన టీమ్ అని, అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుందని స్పష్టంచేశారు.

Also Read: TG Panchayat Elections: ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా దావత్‌లు.. ఉగుతున్న మందు బాబులు

గ్లోబల్ సమ్మిట్‌కు కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. సోమవారం.. గ్లోబల్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishsna Reddy) హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తోందని, అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ప్రధాని మోడీ సర్కార్ పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit) విజయవంతం కావాలని, తెలంగాణ అన్నివిధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Also Read: Indigo Disruptions: ఇప్పటివరకు రూ.610 కోట్లు రిఫండ్.. ఇండిగో కీలక ప్రకటన.. మెరుగుపడుతున్న సర్వీసులు

Just In

01

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!

Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!