CM Revanth Reddy: పదేళ్ల ప్రభుత్వానికి సీఎం ప్రణాళిక
CM Revanth Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

CM Revanth Reddy: పదేళ్ల ప్రభుత్వానికి సీఎం ప్రణాళిక.. ఓ పక్క అప్పులు తీరుస్తూ..!

CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై మెజార్టీ ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నట్లు స్పష్టమవుతున్న ది. ప్రభుత్వ పాలన, పనితీరుపై పబ్లిక్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ సఫలమైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం హామీలకే పరిమితం కాకుండా, ఆచరణలో చూపిస్తున్న చిత్తశుద్ధి కి నిదర్శనంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్ధతు పలికారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలతో ప్రభుత్వం ఏర్పడగా, ఆ తర్వాత అమలు చేస్తున్న స్కీమ్ లు,కార్యక్రమాలతో ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లు స్పష్టంగా చెప్పవచ్చు. పైగా ప్రభుత్వ పాలనకు రెఫరెండం గా భావించి మరీ కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పబ్లిక్ హస్తం గుర్తు వైపు అండగా నిలిచారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు కురిపిస్తున్నా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నా….పబ్లిక్ ఆయా పార్టీలకు స్పష్టంగా తిరస్కరించినట్లు వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాల తీరును పరిశీలిస్తే

కంటోన్మెంట్.. జూబ్లీహిల్స్ ఫలితాలే కొలమానం…

కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టింది.సంప్రదాయ ఓటు బ్యాంకులను దాటుకొని ప్రజలు పాలకపక్షానికి పట్టం కట్టారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండు సెగ్మెంట్లలోనూ సెంటిమెంట్ పాలిటిక్స్ కు చెక్ పెడుతూ పబ్లిక్ విభిన్న తీరులో తీర్పునిచ్చారు. ఇది ప్రభుత్వ విజయంగా స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ కు క్లిష్టంగా మారిన జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ పార్టీ పట్ల ఆదరణ పెరగడం విశేషం. పబ్లిక్ మూడ్ ఎలా ఉందనేది ఈ ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో గెలుపు ఓటముల కంటే, ఓటింగ్ శాతం అనేది పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓటింగ్ శాతం కంటే, ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.2023 ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు కాంగ్రెస్ కు రాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఇచ్చారు .కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లను కాంగ్రెస్ సాధించుకోవడం విశేషం.గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఓటు బ్యాంకును స్థిరీకరించుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ప్రభావం చూపిస్తుందని పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

Also Read: Uttam Kumar Reddy: పారా బాయిల్డ్ రైస్‌పై.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ వినతి!

ఆర్ధిక వ్యవస్థ బ్యాలెన్స్….?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి సుమారు 8 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ఆ నేతలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ గణాంకాలను పలుమార్లు ప్రకటించారు. ప్రస్తుతం వడ్డీలు, అసల్లో కొంత కలిపి ప్రతీ నెల ప్రభుత్వం రూ. 8 వేల కోట్లను చెల్లించాల్సి న పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, గుట్టలుగా పేరుకుపోయిన అప్పులు ఒక పక్కన సవాలు విసురుతున్నా.. సంక్షేమాన్ని మాత్రం ప్రభుత్వం విస్మరించలేదు . ఒకవైపు పాత అప్పులకు వడ్డీలు, అసలు చెల్లిస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారు.’అభయహస్తం’ గ్యారెంటీలను అమలు చేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపకుండా సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చడం ఈ ప్రభుత్వ పనితీరుకు ‘శభాష్’ అనిపించుకునేలా చేసింది. రుణమాఫీ ,సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నధాన్యాలకు రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చే తదితర పథకాలు కాంగ్రెస్ర పాలనకు నిదర్శనంగా మారాయి. ఆరు గ్యారం

పదేళ్ల ప్రభుత్వానికి సీఎం ప్రణాళిక..

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేలా విజన్ డాక్యుమెంట్ తో ముందుకు సాగుతున్నారు.తాత్కాలిక తాయిలాల కంటే, శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ వంటి కార్యక్రమాల ద్వారా పాలనను ప్రజల వద్దకు చేర్చారు. రాజకీయ సుస్థిరతతో పాటు, అభివృద్ధిలోనూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పదేళ్ల ప్లాన్ ను అమలు చేస్తున్నారు.పాలనలో పారదర్శకత, పనితీరులో వేగం, వెరసి ప్రజల సంతృప్తిగా మారింది. కంటోన్మెంట్ ఫలితమైనా, పెరుగుతున్న ఓటింగ్ శాతమైనా.. అది కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌న‌: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏవ‌ర్గాన్ని విస్మ‌రించ‌కుండా అభివృద్ది, సంక్షేమానికి స‌మ ప్రాధాన్య‌తనిస్తూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకున్నాం. అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది. ధ‌నిక రాష్ట్రాన్ని త‌మ స్వార్ధ‌పూరిత నిర్ణ‌యాల‌తో ప‌దేళ్ల‌లో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల‌లోనే సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ది దిశ‌లో ప‌రుగులు పెట్టిస్తున్నాం.సన్నబియ్యం ఇందిర ఇండ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయి . ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి ర‌ధం పరుగులు తీస్తోంది.వ్యవ‌సాయ‌, పారిశ్రామిక రంగాల‌లో గ‌ణ‌నీయ‌మైన ప్రగ‌తిని సాధిస్తున్నాం. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌ని

Also Read: Viral Video: చాలా బోర్ కొడుతోంది.. ఇక పని చేయలేనంటూ.. ఉద్యోగం వదిలేసిన Gen Z కుర్రాడు

Just In

01

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా