Rahul Ravindran: రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) క్లైమాక్స్ సన్నివేశంలో రష్మిక లుక్, ఆమె ముఖం, దుస్తులపై కనిపించిన రంగుల గురించి సినీ అభిమానుల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఓటీటీలో ఈ సినిమాను చూసిన వారంతా రాహుల్‌ను అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్‌కు ఆయన రిప్లయ్‌లు కూడా ఇస్తున్నారు. రష్మిక ఒంటిపై, ముఖంపై ఉన్న కలర్స్‌కు సంబంధించిన ఫొటోని చూపిస్తూ.. సేమ్ టు సేమ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా రంగులతో నిండిన ఫేస్‌తో ఉన్న సీన్‌కు కనెక్ట్ చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా ‘అర్జున్ రెడ్డి’ కనెక్షన్ ఉందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రోమో ఎప్పుడో తెలుసా? అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..
ఆ రంగుల వెనుక ‘అర్జున్ రెడ్డి’ కనెక్షన్ ఉందా?
ఒక నెటిజన్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ఉద్దేశించి, ‘‘క్లైమాక్స్‌లో రష్మికకు ఈ ప్రత్యేకమైన లుక్ ఎందుకు ఇచ్చారు? ఆమె ముఖం, దుస్తులపై ఆ రంగులు ఎందుకు? ఇది చాలా పవర్‌ఫుల్ ఇమేజరీ, కానీ దీనికి ‘అర్జున్ రెడ్డి’తో లేదా మరేదైనా సినిమాతో సంబంధం ఉందా?’’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ రవీంద్రన్, ఆ సన్నివేశం వెనుక ఉన్న అసలు కారణాన్ని, భావోద్వేగ లోతును వివరించారు. ఆ రంగుల వాడకానికి మరే ఇతర సినిమాతో సంబంధం లేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు.
No buddy… it had nothing to do with any other movie. Vikram uses these colours/paint to shame and humiliate her. She has learnt to embrace it now. She knows it’s a part of her now. That acceptance makes her stronger, invincible even. And for someone who starts out as an… https://t.co/jfdcWe3Zh9
— Rahul Ravindran (@23_rahulr) December 7, 2025
అవమానాన్ని జయించడమే
ఆయన వివరణ ఇస్తూ. ‘‘లేదు మిత్రమా, దీనికి ఏ ఇతర సినిమాతో సంబంధం లేదు. ఈ రంగులను విక్రమ్ అనే పాత్ర ఆమెను అవమానించడానికి, కించపరచడానికి ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఆమె వాటిని అంగీకరించడం నేర్చుకుంది. ఆ అవమానపు రంగులు ఇప్పుడు ఆమెలో భాగమయ్యాయని, ఆ స్వీయ అంగీకారం ఆమెను మరింత శక్తిమంతంగా, ఎవ్వరూ జయించలేని వ్యక్తిగా మారుస్తుందని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
Also Read- Akhanda 2: ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది కానీ.. ఇప్పుడు మరో సమస్య!
నిస్సత్తువ నుంచి నిలబడే వరకు
ఈ చిత్రం కథానాయికగా రష్మిక పాత్ర పరిణామక్రమాన్ని ఈ విజువల్స్ స్పష్టంగా చూపిస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. సినిమా మొదట్లో భావాలను వ్యక్తపరచలేని ఒక సాదారణ యువతిగా కనిపించే ఆమె, చివరికి అదే అవమానపు రంగులతో కళాశాల ముందు పూర్తి ధైర్యంతో నిలబడటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవడమే ఈ సన్నివేశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రంగులు కేవలం పెయింట్ మాత్రమే కాదని, అవమానానికి లొంగిపోకుండా దానిని సవాలుగా స్వీకరించిన ఆమె అంతర్గత బలానికి దృశ్య రూపకమని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. అందుకే, ఈ సన్నివేశానికి ‘మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!’ అనే భావనను దృశ్యమానం చేయడానికి ఈ రంగుల ఎంపిక జరిగింది అని దర్శకుడు ముగించారు. ఈ వివరణతో సినిమా క్లైమాక్స్ వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం అభిమానులకు అర్థమైందని భావించవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

