Champion: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్తదనం కంటెంట్ అందించే బ్యానర్లలో స్వప్న సినిమాస్ ఒకటి. ఇప్పుడీ బ్యానర్ నుంచి రాబోతున్న చిత్రం ‘ఛాంపియన్’ (Champion). జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. అనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంతో కూడా స్వప్న సినిమాస్ తమ ప్రత్యేకతని కొనసాగిస్తోంది. యంగ్ ఛాంప్ రోషన్ (Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సంచలనం అనశ్వర రాజన్ (Anaswara Rajan) టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyan Chakravarthy) కం బ్యాక్ ఇస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
Also Read- New Guy In Town: సంచలనం రేపుతున్న ఎస్. థమన్ ట్వీట్.. టాలీవుడ్‌లో ఆ మిస్టీరియస్ ‘న్యూ ఫేస్’ ఎవరు?
35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎవరో కాదు, నటసింహం బాలకృష్ణకు సోదరుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు బాబాయ్ వరుస అవుతాడు. ఇంకా చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన నటుడాయన. దాదాపు 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే స్వప్న సినిమాస్ బ్యానర్ ఆయనను మళ్ళీ స్క్రీన్ పైకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందట. ఆ ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. ‘చాంపియన్’ కథ, అందులోని ఆయన పాత్రకు ఉన్న డెప్త్ కళ్యాణ్ చక్రవర్తిని ఇంప్రెస్ చేయడంతో, ఆయన ఈ సినిమాలో చేయడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆయన రైతు పాత్రలో రాజి రెడ్డిగా కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని కూడా మేకర్స్ వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘సల్లంగుండాలే’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని మేకర్స్ వదిలారు. ఈ పాట ఆయనపైనే షూట్ చేయడం విశేషం.
పిల్ల పాపలతోని పచ్చంగా ఉండాలే
పాటను గమనిస్తే.. ‘లొంగిపోయినొన్ని సంపనీకి మీలెక్క రాక్షసులం కాదురా.. రైతులం. ఇన్నేళ్లుగా నిజాంల పక్కన చేరి జనం ఉసురు పోసుకుంటున్నా.. ధర్మమని గమ్మునున్నాం. ఈ ఊరుని విడవడం.. నా ప్రాణం విడిసినప్పుడే సుందరయ్యా’ అని కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్‌ని పరిచయం చేసిన టీమ్.. తన కుమార్తె తన దగ్గరకు వచ్చి ‘నాకు ఈ లగ్గం వద్దు బాపు.. మీరందరు ఊరు కోసం కోట్లాడుతుంటే, నేను మాత్రం లగ్గం చేసుకుని ఎళ్లిపోవాల్న. బతుకైనా, చావైనా నేనిడ్నే ఉంటా’ చెప్పగానే..
‘సల్లంగుండాలే, సల్లంగుండాలే.. పెళ్లి చేసుకుని నువ్వు పైలంగా ఉండాలే.
సల్లంగుండాలే, సల్లంగుండాలే.. పిల్ల పాపలతోని పచ్చంగా ఉండాలే..’ అంటూ సాగే పాట మొదలవుతుంది. ఈ పాట ప్రోమోని మేకర్స్ వదిలారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాట చార్ట్‌బస్టర్ హిట్ అవుతుందనే ఫీల్‌ని ఈ ప్రోమోనే ఇస్తుండటం విశేషం. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ ప్రోమోలో తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

