Suriya47: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Kollywood Star Hero Suriya)కి హిట్ పడి చాలా కాలం అవుతుంది. అర్జెంట్‌గా ఆయనకు హిట్ కావాలి. ఇటీవల ఆయన ఎంతో నమ్మకంగా చేసిన ప్రాజెక్ట్‌లన్నీ సూర్యకు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం సూర్య మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ చిత్రం (Suriya46) చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే.. తాజాగా ఆయన తన 47వ చిత్రాన్ని (Suriya47) ప్రారంభించారు. సూర్య హీరోగా చేయబోతున్న తన 47వ చిత్రానికి సంబంధించి ఆదివారం చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర తారాగణంతో పాటు, సిబ్బంది, పరిశ్రమ ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అసలీ 47వ చిత్రంలో నటించే హీరోయిన్, దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే..
హీరోయిన్, దర్శకుడు ఎవరంటే..
సూర్య 47వ సినిమా కోసం ‘ఆవేశం’ ఫేమ్, మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్ (Jithu Madhavan)తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్‌లో కీలకమైన వాటిలో ఒకటిగా నిలిస్తూ.. అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో సూర్య సరసన టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ మధ్య విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జఘరమ్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తోంది. చెన్నైలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు చిత్ర నిర్మాత శ్రీమతి జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్ పాండియన్ (2D ఎంటర్‌టైన్‌మెంట్), నిర్మాతలు S.R. ప్రకాష్, S.R. ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) వంటి వారంతా హాజరయ్యారు. వీరందరూ సినిమా ఘన విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం, చిత్రీకరణను ప్రారంభించారు. అధికారికంగా మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలిపారు.
Also Read- Bigg Boss Elimination: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?
కొత్తగా ప్రయత్నిస్తున్నాం
ఈ సందర్భంగా దర్శకుడు జితు మాధవన్ మాట్లాడుతూ.. ‘కొత్త పరిశ్రమ, కొత్త ప్రారంభం, అదీ కూడా సూర్య వంటి స్టార్‌తో.. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మేము కొత్తగా ఏదైనా చేయడానికి, ప్రేక్షకులకు అలాంటి అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. మేము అందించాలనుకుంటున్న ఫ్రెస్ నెస్‌ని ప్రేక్షకులు అంగీకరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తాము” అని తెలిపారు. జాన్ విజయ్, ఆనందరాజ్ వంటి ప్రముఖులెందరో నటిస్తున్న ఈ చిత్రానికి వినీత్ ఉన్ని పలోడే సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్ సంగీతం, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్, అజ్మల్ సాబు ఎడిటింగ్, చేతన్ డి సౌజా స్టంట్ మాస్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

