Roads Development: వచ్చే ఏడాది నుండి విమాన కార్గో సేవలు..!
Roads Development (imagecredit:twitter)
Telangana News

Roads Development: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుండి విమాన కార్గో సేవలు..!

Roads Development: ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కలిపేలా రహదారుల నిర్మాణం చేపడుతుంది. సింగిల్ లేన్ రోడ్లను డబుల్ గా, డబుల్ లేన్ రోడ్లను 4 లేన్లుగా అభివృద్ధి చేస్తుంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా వేల కోట్లు ఖర్చుచేస్తూ నిర్మాణం చేపడుతుంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్ ల నిర్మాణానికి రూపకల్పన చేస్తుంది.

మెరుగైన రవాణా మార్గం

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మొత్తం 29,075 కి.మీ రహదారి నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మార్కెట్లు, విద్య, వైద్య కేంద్రాలకు మెరుగైన రవాణా మార్గాన్ని కల్పిస్తూ ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 6617.86 కోట్ల విలువైన 239 పనులకు అనుమతులు వచ్చాయి. ఈ పనుల్లో 1659 కి.మీ రహదారులు, 62 వంతెనలు ఉన్నాయి. ఇందులో 1383 కి.మీ రోడ్లను సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్‌గా, 242 కి.మీ రహదారులను ఫోర్ లేన్‌గా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజాపాలన మొదలైన నాటి నుంచి నేటి వరకు 514.80 కి.మీ రహదారి విస్తరణ పనులు , 69 వంతెనల నిర్మాణం పూర్తయ్యాయి. .617.5 కి.మీ మేర రోడ్డు పునరుద్ధరణ పనులు జరిగాయి. రూ.865.64 కోట్ల వ్యయంతో 30.96 కి.మీ పొడవు గల అంబర్‌పేట్, బీహెచ్ ఈఎల్ , ఆరంఘర్శంషాబాద్, నిర్మల్ఖానాపూర్ రహదారులు నాలుగు ప్రాజెక్టులను ఈ ఏడాది కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే సుమారు రూ. 7వేల కోట్ల వ్యయంతో ఒక కోటి చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వం పదేళ్లలో ఆర్ అండ్ బీ పరిధిలో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడితే.. కేవలం 2 ఏళ్ల లోపే గత రికార్డును బ్రేక్ చేసింది.

రూ. 8 వేల కోట్లతో ఎలివేటేడ్ కారిడార్

హైదరాబాద్అమరావతిమచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచారు. హైదరాబాద్శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ : మన్ననూర్ నుండి శ్రీశైలం వరకు సుమారు రూ. 8 వేల కోట్లతో ఈ ఎలివేటేడ్ కారిడార్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఘాటు రోడ్డు బాధలు తప్పడమే గాక ౩గంటల ప్రయాణం, 53 కి.మీ దూర భారం తగ్గుతుంది. దీని వ్యయంలో రాష్ట్రం 33శాతం భరించనుంది. హైదరాబాద్మన్నే గూడ రహదారి (ఎన్‌హెచ్ -163) నాలుగు లైన్ల పనుల వేగవంతం అవుతున్నాయి.

Also Read: MP Raghunandan Rao: బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి.. ఎంపీ విజ్ఞప్తి

వచ్చే ఏడాదికి విమాన కార్గో సేవలు

కొత్త విమానాశ్రయాలకు మార్గం

వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, రామగుండం కొత్త విమానాశ్రయాలకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది చివరి నాటికి వరంగల్ విమానాశ్రయంలో కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. యాదగిరిగుట్ట, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జునసాగర్, రామగిరి కోటలో నాలుగు చోట్ల రోప్ వేలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

రూ. 60,799 కోట్లతో భారీ ప్రాజెక్టులు

ముఖ్యమంత్రి విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పెంపునకు రూ. 60,799 కోట్లతో ప్రకటించిన భారీ ప్రాజెక్టుల వివరాలు రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోశాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత నాణ్యతతో “మిర్రర్ స్మూత్” రోడ్లు , ప్రమాద రహిత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. నాణ్యతకు హామీ ఇచ్చే హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ కింద రూ.11,399 కోట్లతో 419 రోడ్లను 32 ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ మోడల్‌లో కాంట్రాక్టర్లు 15 ఏళ్ల పాటు రోడ్డును నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన పెట్టడం విశేషం.

బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దేందుకు రూ.288 కోట్లు

హైదరాబాద్విజయవాడ (ఎన్ హెచ్-65) పై ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దేందుకు రూ.288 కోట్ల పనులు ఆమోదం పొందాయి. సుమారు రూ.10,400 కోట్లతో ఈ రహదారిని 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ వేగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధమవుతోంది. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును ఎన్‌హెచ్ 161ఏఏగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.36వేల కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

కొత్త హైకోర్టు కాంప్లెక్స్‌లు

రూ.2583 కోట్లతో హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో కొత్త హైకోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. 12 జిల్లాలలో జిల్లా కోర్టు భవనాల సముదాయాలు రూ. 972 కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనం రూ.2,700 కోట్లతో 2028 నాటికి పూర్తి చేయనున్నారు. కొడంగల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల (రూ. 200 కోట్లు), ప్రభుత్వ వెటర్నరీ సైన్స్ కాలేజీ (రూ. 200 కోట్లు) భవన నిర్మాణాలు మొదలయ్యాయి. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజాపాలనలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశారు. ఒకే రోజు 118 మంది ఏఈలకు డీఈలుగా.. 64 మంది డీఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సును హైదరాబాద్‌లో 2026లో నిర్వహించేందుకు సిద్దమైంది.

Also Read: Thimmapur Election Scam: స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు.. ఊరు లేదు.. జనాలు లేరు.. అయినా పంచాయతీ నోటిఫికేషన్..!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం