Aamir Love: ప్రేమ దొరకడంపై ఆమిర్ ఖాన్ సంచలన కామెంట్స్..
ameer-khan( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Aamir Love: అరవై ఏళ్ల వయసులో తనకు ప్రేమ దొరకడంపై ఆమిర్ ఖాన్ సంచలన కామెంట్స్..

Aamir Love: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తన కొత్త భాగస్వామి గౌరీ స్ప్రట్‌తో ఉన్న బంధం గురించి మనసు విప్పి మాట్లాడారు. తన 60 ఏళ్ల వయసులో ప్రేమ దొరకడం తనకు అనూహ్యమని ఆయన తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, తాను మళ్లీ భాగస్వామిని కనుగొంటానని అస్సలు ఊహించలేదని అన్నారు. “నేను ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. జీవితంలో నాకు భాగస్వామి దొరకదేమోనని ఒక దశకు చేరుకున్నాను. కానీ గౌరీ నా జీవితంలోకి వచ్చింది. ఆమె నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తెచ్చింది. ఆమె నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఆమెను కలవడం నా అదృష్టం,” అని అన్నారు.

Read also-Savitri Jayanthi: మహానటి సావిత్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు.. ఆ పాత్రే కనబడేది..

తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం గురించి కూడా ఆమిర్ ఖాన్ మాట్లాడారు. విడాకుల తర్వాత కూడా తమ మధ్య ఉన్న ఆప్యాయత, గౌరవాన్ని ఆయన వివరించారు. “మేము విడిపోయినా, ఇప్పటికీ ఒకే కుటుంబంలా ఉన్నాము. రీనా అద్భుతమైన వ్యక్తి. మేము భార్యాభర్తలుగా విడిపోయామే తప్ప మనుషులుగా కాదు. ఆమె పట్ల నా హృదయంలో చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. కిరణ్ విషయంలోనూ అంతే. ఆమె అద్భుతమైన వ్యక్తి. మేము విడిపోయాము, కానీ మేమంతా ఒక కుటుంబం. రీనా తల్లిదండ్రులు, కిరణ్ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు.. మేమంతా ఒక్కటే,” అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు.

Read also-Gummadi Narsaiah biopic: తెలుగు సినిమా మీద ఉన్న చులకన భావానికి ఇదే నిదర్శనం.. ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

రీనా, కిరణ్, ఇప్పుడు గౌరీ.. ఈ ముగ్గురు మహిళలూ తన వ్యక్తిత్వానికి ఎంతో తోడ్పడ్డారని, వారి విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఆమిర్ ఖాన్ ఈ ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్ప్రట్‌ను తన భాగస్వామిగా బహిరంగంగా పరిచయం చేశారు. వారు గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారని సమాచారం. గౌరీ స్ప్రట్ ప్రస్తుతం ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!