Savitri Jayanthi: సావిత్రిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య..
sanitri-jayanthi(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Savitri Jayanthi: మహానటి సావిత్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు.. ఆ పాత్రే కనబడేది..

Savitri Jayanthi: మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు.

Read also-TV Premieres: ఈ రోజు టీవీలో ప్రసారం అయ్యే సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి మరి..

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథమని, సినీ రంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రిగారే అని కొనియాడారు . నటులు, నిర్మాత మురళీమోహన్‌, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌, రచయిత సంజయ్‌కిషోర్‌, ప్రచురణ కర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి గారి పాటల పల్లవులను ఆలపించారు. అనంతరం సావిత్రి గారిపై రూపొందించిన అవార్డు గ్రహీతల డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంజయ్‌ కిషోర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Read also-Madhuri Srinivas: బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బుతో దివ్వెల మాధురి ఏం చేసిందో తెలుసా?..

Just In

01

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..

Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్