CM Chandrababu: జగన్‌కు దేవుడన్నా లెక్కలేదు: సీఎం చంద్రబాబు
Chandrababu-Vs-Jagan (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

CM Chandrababu: జగన్‌కు దేవుడన్నా లెక్కలేదు.. సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు

CM Chandrababu: ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలన్నా జగన్‌కు లెక్కలేదు

వైసీపీ అధినేతపై సీఎం చంద్రబాబు విమర్శనాస్త్రాలు

అమరావతి: ‘‘వైఎస్ జగన్‌కు దేవుడన్నా లెక్కలేదు… ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదు… ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదు’’ అని వైసీపీ అధినేతపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేయగా, శ్రీవారి పరకామణి దొంగతనం వ్యవహారంపై జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించగా చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని జగన్ చూశాడని చంద్రబాబు ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూశాడని, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.

Read Also- New Year Drugs Supply: న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సిద్ధం చేసి.. అడ్డంగా దొరికారు.. వాటి విలువ ఎంతంటే?

దొంగతనాన్ని కూడా తప్పు కాదని చెప్పే వాళ్లను ఏమనాలి?, సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యాలా? అని జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ‘‘దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా… తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నాడు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశాం అని తేలిగ్గా మాట్లాడుతున్నాడు. భక్తుల ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి?. శ్రీవారి హుండీలో చోరీ పట్ల జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోను తీవ్ర ఆవేదన కనిపిస్తోంది. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. 72 వేలు అనేది చిన్న దొంగతనం చెపుతున్నాడు. దేవుడి హుండీలో చోరీ చిన్న తప్పా? దాన్ని సెటిల్ చెయ్యడం మహాపాపం కాదా?. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Read Also- Divorce Ruling: ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్య బెదిరింపు క్రూరత్వమే.. విడాకులు ఇస్తూ హైకోర్ట్ సంచలన తీర్పు

మొహమాటాలు లేవు

మీడియా చిట్‌చాట్‌లో శాంతి భద్రతల అంశంపైనా కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం ప్రశాంతమైన మంచి ప్రాంతాలను కూడా నేరమయం చేసిందని, నేరస్తులను పెంచి పోషించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘‘నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లు ఎప్పుడైనా చూశామా?, ఇటువంటి సంస్కృతికి కారణం ఎవరు?. విజయనగరం, నెల్లూరు వంటి జిల్లాలకు ప్రశాంతకు మారుపేరుగా ఉండేవి. ఈ జిల్లాలకు ఎలాంటి అధికారులను ఎస్పీలుగా నియమించినా సరిపోయేది. కానీ గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్తులు తయారు అయ్యారు. నెల్లూరు లాంటి జిల్లాలో లేడీ డాన్లు తయారు చేశారంటే 5 ఏళ్లు ఎలాంటి పాలన సాగిందో అర్థం చేసుకోవాలి. వీటిని ప్రక్షాళన చేస్తున్నాం. నేరస్తులను ఏరివేస్తున్నాం. రౌడీలను అణిచివేస్తాం. రాజధాని రైతులు, నిర్మాణం అంశాలపై సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తున్నాం. రాజధాని పనుల వేగం పెరిగింది. నాతో రాజధాని రైతుల సమావేశం తరువాత మంచి ఫలితాలు వస్తున్నాయి. రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. రెండో ఫేజ్ భూ సమీకరణకు కూడా రైతులు ముందుకు వచ్చారు, ఇది మంచి పరిణామం. ప్రజలు, రైతులు, ప్రభుత్వం అంతా సంతోషంగానే ఉన్నారు. కొందరికి మాత్రం కడుపుమండుతోంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక బ్రాండ్‌గా మారింది. విద్యా శాఖలో తీసుకువస్తున్న మార్పులు ఫలితాలను ఇస్తున్నాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

Just In

01

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని ఓడినా సరే వారు నాకు సర్పంచులే: జగ్గారెడ్డి

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..