Police Complaint: గ్లామర్ పాత్రలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్టర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో వరలక్ష్మి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. ఎమ్మెస్త్కే ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహరాణా నిర్మిస్తుండగా దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్ ,అమిత్, దిల్ రమేష్, పృథ్వీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read also-Sonia Gandhi: సోనియా గాంధీ అరుదైన స్పీచ్.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్రయూనిట్ అందరి సపోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం, సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే విడుదలకు సన్నాహాలు చేస్తాము” అని తెలిపారు. ‘పోలిస్ కంప్లెయింట్’ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని చిత్రయూనిట్ చెబుతోంది.
Read also-Sonu Sood: ఇండిగో విమాన ప్రయాణీకుల అసంతృప్తిపై సోనూ సూద్ ఏం చెప్పారంటే?..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా ఎస్ఎన్ హరీష్ ఉన్నారు. ఎడిటింగ్ బాధ్యతలు అనుగోజు రేణుకా బాబు నిర్వహిస్తున్నారు. ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి కలిసి సంగీతం అందిస్తున్నారు. సాగర్ నారాయణ, సంజీవ్ మేగోటి, చింతల ప్రసన్న రాములు సాహిత్యం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా మురళీధర్ కొండపనేని ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, రవితేజ కంపోజ్ చేస్తున్నారు. సూర్య కిరణ్ , రాజ్ పైడి కొరియోగ్రఫర్లుగా ఉన్నారు. పీఆర్‌ఓగా అశోక్ దయ్యాల వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకు రాబోతుందని మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమా విడుదల కోసం నవీన్ చంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

