Sonu Sood: విమానాల్లో ఇటీవల జరిగిన రద్దులు, ఆలస్యాల నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇండిగో చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి ఆయన ఓ సందేశాత్మకమైన వీడియోను విడుదల చేశారు. అందులో ఏం అన్నారంటే?.. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం ఎవరికైనా నిరాశ కలిగించే విషయమే. అత్యవసర పనులు, ముఖ్యమైన సమావేశాలు, కుటుంబ వేడుకలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం తీవ్ర ఒత్తిడిని, కోపాన్ని కలిగిస్తుంది. అయితే, ఈ క్లిష్ట సమయంలో మన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి సరైన వ్యక్తులు ఎవరు? ఆ కోపం ఎవరిపై చూపాలి? అన్నది ఆలోచించాలి. “ఆలస్యమైన విమానం నిరాశ కలిగిస్తుంది, కానీ దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్న ముఖాలను గుర్తుంచుకోండి. దయచేసి ఇండిగో సిబ్బందితో మంచిగా, వినయంగా వ్యవహరించండి. రద్దుల భారాన్ని వారు కూడా మోస్తున్నారు. వారికి మనం మద్దతు ఇద్దాం” అని సోనూ సూద్ చేసిన పోస్ట్ మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది.
Read also-Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికే.. మరోసారి కన్ఫర్మ్ చేసిన మేకర్స్!
విమానాలు ఆలస్యం కావడానికి లేదా రద్దు కావడానికి గల కారణాలు తరచుగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలు లేదా కొత్త విధి నిర్వహణ సమయ నిబంధనలు (FDTL) వంటి ఉన్నత స్థాయి నిర్ణయాలు లేదా అనివార్య పరిస్థితులు. కానీ, ప్రయాణికుల నుంచి ఆగ్రహాన్ని, విమర్శలను ఎదుర్కొనేది మాత్రం ఫ్రంట్‌లైన్ గ్రౌండ్ స్టాఫ్ మాత్రమే. వారి స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే, పరిస్థితి అర్థమవుతుంది. వారు కేవలం పై అధికారుల నుండి వచ్చే సమాచారాన్ని ప్రయాణికులకు అందించే మధ్యవర్తులు మాత్రమే. విమాన షెడ్యూల్‌ను మార్చే శక్తిగానీ, రద్దును నిలిపివేసే అధికారం గానీ వారికి ఉండదు. ఒక ఉద్యోగిగా, తమ నియంత్రణలో లేని సమస్యకు తమపై అరిచే వందలాది మంది ప్రయాణికులను ఎదుర్కోవడం వారికి కూడా బాధాకరమే. ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాన్ని, నొప్పిని వారు అర్థం చేసుకుంటారు, కానీ నిస్సహాయ స్థితిలో ఉంటారు.
అంతే కాకుండా మరో సందేశాన్ని తన సోషల్ మీడియా వేదికడా షేర్ చేశారు. ‘మీరు చెప్పింది నిజమే. యుద్ధం లేదా సంక్షోభం సమయంలో అత్యవసర వస్తువులను ఆకాశాన్నంటే ధరలకు అమ్మడం అనేది స్పష్టమైన దోపిడీ. అలాగే, నియంత్రణ లేదా నిర్వహణ సమస్యలు వచ్చినప్పుడు విమానయాన సంస్థలు ఛార్జీలను 5 నుండి 10 రెట్లు పెంచడం కూడా అంతే. సంక్షోభం అనేది లాభాలను ఆర్జించడానికి లైసెన్స్ కాదు. సామాన్య ప్రయాణికుడిని రక్షించడానికి మనకు కఠినమైన ఛార్జీల పరిమితులు అవసరం. గరిష్టంగా 1.5 నుండి 2 రెట్లు మించకుండా ధరలను నియంత్రించాలి. అంటూ మరో ట్వీట్ చేశారు.
"A delayed flight is frustrating, but remember the faces trying to fix it. Please be nice and humble to the IndiGo staff; they are carrying the weight of cancellations too. Let’s support them." @IndiGo6E pic.twitter.com/rd3ciyekcS
— sonu sood (@SonuSood) December 6, 2025

