Akhanda 2 Producers: ప్రయత్నాలు ఫలించలేదు.. ఫ్యాన్స్‌కు సారీ!
Akhanda 2 Producers (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 Producers: ప్రయత్నాలు ఫలించలేదు.. అభిమానులకు క్షమాపణలు, కొత్త తేదీ త్వరలో!

Akhanda 2 Producers: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) విడుదల వాయిదాపై నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) కీలక ప్రకటన విడుదల చేసింది. చివరి నిమిషంలో సినిమా విడుదల నిలిచిపోవడంపై సంస్థ చింతిస్తూ, తాము చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించలేదని వివరణ ఇస్తూ అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్‌లో.. ‘‘మేము అఖండ2 చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి మా శాయశక్తులా ప్రయత్నించాం. మా నిరంతర కృషి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి, దురదృష్టవశాత్తూ ఇది మాకు అలాంటి సమయమే’’ అని 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.

Also Read- Actress Pragathi: నవ్వుకున్న వాళ్లందరికీ ఇదే ప్రగతి ఆన్సర్.. ఇండియా తరపున టర్కీ ఏషియన్ గేమ్స్‌కు!

మరోసారి క్షమాపణలు చెప్పిన నిర్మాతలు

ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులకు తాము మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నట్లు (We sincerely apologize to all the fans and cinema lovers across the world) ప్రకటించింది. ఈ ప్రకటనతో, ఇటీవల వార్తల్లో వినిపించిన ఆర్థిక వివాదాలు, మద్రాస్ హైకోర్టు తీర్పుల కారణంగానే సినిమా విడుదల వాయిదా పడినట్లుగా స్పష్టమవుతోంది. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు బోయపాటి శ్రీనుకు నిర్మాణ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ’ సృష్టించిన సంచలనం దృష్ట్యా, దాని సీక్వెల్ అయిన ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అనూహ్య వాయిదా అభిమానులను నిరాశకు గురిచేసినప్పటికీ, చిత్ర బృందం సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఈ ప్రకటన ద్వారా తెలుస్తోంది.

Also Read- Mirchi Madhavi: ప్రకాశ్ రాజ్ వైఫ్ పాత్ర.. ఐదుగురుతో కాంప్రమైజ్ అడిగారు.. నటి మిర్చి మాధవి షాకింగ్స్ కామెంట్స్

కొత్త తేదీతో త్వరలో!

విడుదల వాయిదా పడినప్పటికీ, సినిమా విజయంపై నిర్మాణ సంస్థ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘అఖండ-2 ఎప్పుడు వచ్చినా లక్ష్యాన్ని ఛేదిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేస్తూ, త్వరలోనే కొత్త విడుదల తేదీతో వస్తున్నామని ప్రకటించింది. కోర్టు వివాదాను, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుని, ‘అఖండ 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్తను అందించేందుకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎంతగానో కృషి చేస్తున్నట్లుగా ఈ ట్వీట్ తెలియజేస్తుంది. సో.. బాలయ్య అభిమానులు ఈ మాస్ ట్రీట్ కోసం మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా, అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బండ బూతులు తిడుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క