Rising Global Summit: తెలంగాణకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ( Telangana Rising Global Summit) ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలో (Future City) నిర్వహిస్తుండగా, వేదిక నిర్మాణానికి సంబంధించిన తొలి ఫొటో శుక్రవారం నాడు విడుదలైంది. డ్రోన్‌తో తీసిన ఈ ఫొటో అబ్బుర పరుస్తోంది. వేదిక నిర్మాణంలో జరిగిన పురోగతి ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ నగరం సమాయత్తమవుతోందని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో వచ్చే సోమ, మంగళవారాల్లో ప్రపంచ పారిశ్రామిక నాయకులు, ఆవిష్కర్తలు, విజనరీ వ్యక్తులకు ఈ ప్రాంతం స్వాగతం పలుకుతుందని హర్షం వ్యక్తం చేశారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తన ఆశయం, సాంకేతికత, అవకాశాల ద్వారా సాహసోపేతమైన సరికొత్త అభివృద్ధి నమూనాను తెలంగాణ ప్రదర్శిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
Read Also- SFI Conference: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెలబస్‌లో పెట్టే కుట్ర: ఎస్ఎఫ్ఐ
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ఇదే వేదికపై ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను కూడా విడుదల చేయనుంది. అంతేకాదు, అభివృద్ధి నమూనాను కూడా ఆవిష్కరించనుంది. క్యూర్ (Core Urban Region Economy), ప్యూర్ (Peri-Urban Region Economy), రేర్ (Rural and Agri Region Economy) వంటి అంశాలపై దృష్టి సారించి సమగ్ర వృద్ధి నమూనాను ప్రదర్శించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
ఇక, ఈ సదస్సులో ప్రపంచ స్థాయీ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీలుఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సదస్సు వేదికగా భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దేశ, విదేశాల నుంచి 1,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యం
ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారుల ఆకర్షించి రాష్ట్రంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభుత్వ లక్ష్యంగాఉంది. ఈ లక్ష్యంలో భాగంగా పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలను ఆకర్షించాలని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2,600 మందికి పైగా ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తయారీ, ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీలు, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి కీలక రంగాలలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

