Yoga approved in Asia games
స్పోర్ట్స్

Sports news: ఆసియా క్రీడల్లో యోగా

Yoga set to be included in Asian Games as competitive sport following OCA’s approval

యోగాను నిత్సజీవితంలో భాగం చేసుకోవడం వల్ల అనేక దర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయని నిరూపణ అయింది. ముఖ్యంగా ఊబకాయం, గుండె జబ్బులు, లివర్ వంటివే కాక షుగర్, బిపీ, వెన్నెముక సమస్యలు వంటి అనేక రుగ్మతలను దూరం చేయవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి..
. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకుల పరిశీలనలో వెల్లడైంది. ఆసనాలు వేయడం, ప్రాణాయామం, ధ్యానం చేయడాన్ని రోజువారీ జీవితంలో భాగం చేస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మనకు దూరమవుతాయంటే అతిశయోక్తి కాదు. భారత్ కు చెందిన ఈ యోగా ఇప్పుడు చాలా దేశాలలో ఆమోదయోగ్యంగా మారింది. అందుకే ఒలింపిక్స్ గేమ్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కితే ఆ విశ్వక్రీడల్లో యోగాను కాంపిటేటివ్ స్పోర్ట్స్‌గా చేర్చాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే, 2036 విశ్వక్రీడలకు ముందే ఆసియా క్రీడల్లో యోగాను పోటీ క్రీడగా చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలన్న ఐవోఏ ప్రతిపాదనకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించింది.

భారత్ ప్రతిపాదనకు ఓకే

ఈ విషయాన్ని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష  వెల్లడించింది. ‘యోగాకు గుర్తింపు ఇవ్వాలన్న భారత్ అభ్యర్థనను ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదన స్పోర్ట్స్ కమిటీ ద్వారా జనరల్ అసెంబ్లీకి వెళ్తుంది.’అని పేర్కొంది. ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆమోదం లభిస్తే యోగా ఆసియా క్రీడల్లో చేరనుంది. అయితే, యోగాను పతక క్రీడా లేక ప్రదర్శన క్రీడా ఓసీఏ జనరల్ అసెంబ్లీ నిర్దారిస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన యోగాను పతక క్రీడాగా మారుతుందని ఐవోఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!