2026 Eclipses: 2025 లో గ్రహణాలు ఎలా ఏర్పడ్డాయో అలాగే 2026 లో కూడా ఏర్పడతాయి. ఈ సారి ఖగోళ ప్రేమికుల కోసం ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ ఏడాది మొత్తం రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు చోటు చేసుకోనున్నాయి. సంవత్సర ఆరంభం నుంచే ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనులపండుగా దర్శనం ఇవ్వబోతున్నాయి.
ప్రతి గ్రహణానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే, ఇవి ఒక దేశంలో కనిపిస్తే.. ఇంకో దేశంలో కనిపించవు. దానిని చూడటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ గ్రహణాలపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా, తొలి సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందా తెలుసుకోవడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అలాగే మొదటి పాక్షిక సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026న ఏర్పడనుంది. కానీ, ఈ గ్రహణం ప్రధానంగా సముద్ర ప్రాంతాల మీదుగా మాత్రమే సంభవించడంతో, భారత్‌లో మాత్రం కనిపించదు. అలాగే రెండో సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12, 2026న ఏర్పడనుంది. ఇది పూర్తి సూర్యగ్రహణం (Total Solar Eclipse). అయితే, ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, స్పెయిన్ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో అయితే ఈ గ్రహణం కనిపించే అవకాశం చాలా తక్కువ.
సూర్యగ్రహణాలతో పాటు రెండు చంద్రగ్రహణాలు కూడా 2026లో చోటు చేసుకోనున్నాయి. వాటిలో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం మార్చి 3, 2026న ఏర్పడనుంది. ఇది భారత్‌లో రాత్రివేళ కనిపించే అవకాశం ఉంది. రెండవ చంద్రగ్రహణం ఆగస్టు 28, 2026న ఏర్పడనుంది. అంటే ఇది పాక్షిక చంద్ర గ్రహణం. ఈ గ్రహణం భారత్‌లోని ఎక్కువ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దాని వలన ఖగోళ ప్రేమికులకు ఇది మంచి అవకాశం కానుంది.
గ్రహణాలను చూస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా సూర్యగ్రహణం చూసేటప్పుడు సాధారణ కళ్లజోడు, ఎక్స్-రే షీట్ లాంటివి వాడాలి. ఇవి కళ్లకు తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. తప్పనిసరిగా సర్టిఫైడ్ సేఫ్ సోలార్ గ్లాసెస్ వాడాలి. అయితే, చంద్రగ్రహణం చూడటానికి ఇలాంటి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. నేరుగా ఆకాశాన్ని చూసినా ఏం కాదు. మొత్తం మీద 2026 సంవత్సరం గ్రహణాల పరంగా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోందని చెప్పాలి.

