Task Force Raids: గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ బృందాలు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, VM బంజారా, ముదిగొండ, ఖమ్మం రూరల్,సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వెంసూర్ లోని వివిధ ప్రదేశాలలో బెల్టు దుకాణాలపై ప్రత్యేక దాడి నిర్వహించి రూ.35 వేల విలువ గల IMFL మద్యం సుమారు 600 లీటర్లు, స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించి నట్లు తెలిపారు.
Also Read: Warangal Task Force: బోగస్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాల సృష్టి.. 15 మంది కేటుగాళ్ల అరెస్ట్!
విచ్చలవిడిగా మద్యం సరఫరా
ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి రూ.42 వేల విలువ చేసే 240 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం సరఫరా చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున బెల్ట్ షాపులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలంటే హోరాహోరీగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఓటర్లను రాజకీయ పార్టీలు మభ్యపెట్టే అవకాశాలు ఉన్నందున డబ్బు, మద్యం సరఫరాను అరికట్టడానికే టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
Also Read: Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి

