New Education Policy: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోయే తెలంగాణ నూతన విద్యా పాలసీలో టీ-శాట్ ను భాగస్వామిని చేయాలని విద్యాపాలసీ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుకు టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని కేశవరావు నివాసంలో వేణుగోపాల్ రెడ్డి టీ-శాట్ రూపొందించిన పాలసీ డాక్యుమెంట్ ను అందజేశారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ స్థాయితో పాటు పోటీ పరీక్షల కంటెంట్ అందించి దేశంలోనే డిజిటల్ విద్యా చానళ్ల లో మొదటి స్థానంలో టీ-శాట్ ఉందని వేణుగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. ఐదు సంవత్సరాల విద్యార్థి నుంచి 60 సంవత్సరాల వ్యక్తులకు అవసరమయ్యే విద్యకు సంబంధించిన కంటెంట్ వివిధ డిజిటల్ ప్రసార మాద్యమాల్లో టీ-శాట్ శాటి లైట్, యాప్, ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉందని వివరించారు.
Also Read: Teenmar Mallanna: తెలంగాణలో సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న.. పేరు ఏంటంటే?
ప్రభుత్వం రూపొందించబోయే నూతన ఎడ్యుకేషన్ పాలసీ
4.8 మిలియన్ వ్యూస్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ దేశంలోనే మొదటి స్థానాన్ని రెండు సంవత్సరాల్లో టీ-శాట్ అధిరోహించిందని, తెలంగాణ ప్రభుత్వం రూపొందించబోయే నూతన ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా సైతం తెలంగాణ సమాజానికి డిజిటల్ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈవో వివరించారు. తాను అందజేసిన డాక్యుమెంట్ ను పరిశీలించిన కేశవ రావు సంతృప్తి వ్యక్తంచేసినట్లు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వయోజనులు, మహిళలలతో పాటు ఇతర రంగాలకు అందిస్తున్న డిజిటల్ సేవలను కొనియాడారన్నారు. తెలంగాణ నూతన విద్యావిధానంలో టీ-శాట్ సేవలు తప్పని సరిగా వినియోగించుకునే విధంగా పాలసీని రూపొందిస్తామని హామీ ఇచ్చినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
Also Read: Uttar Pradesh: ఇదెక్కడి విచిత్రంరా బాబు.. ఒకే ఇంట్లో 4 వేలకు పైగా ఓటర్లు

