OnePlus 13: OnePlus తన OnePlus 15 ఫ్లాగ్‌షిప్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసినప్పటికీ, గత సంవత్సరం వచ్చిన OnePlus 13 కి ఇంకా గొప్ప ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కారణంగా ప్రీమియం ఫోన్‌గా పేరు గాంచింది. కొత్త మోడల్ అవసరం లేకుండా మంచి ఫ్లాగ్‌షిప్ కొనాలని అనుకునేవారికి ఇప్పుడు Amazon Indiaలో OnePlus 13పై భారీ తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ.69,999 ఉన్న 12GB + 256GB వేరియంట్ ప్రస్తుతం రూ.63,999కే లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్, క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్లపై అదనంగా రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభించడంతో ధర మరింత తగ్గి రూ.59,999 కే వస్తుంది . ఈ ఫోన్ మొత్తం Midnight Ocean, Black Eclipse, Arctic Dawn వంటి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్ ఇవే..
స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus 13లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, Adreno 830 GPUతో కలిసి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. 6.82-అంగుళాల LTPO 4.1 AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. Ceramic Guard గ్లాస్ ప్రొటెక్షన్ అదనపు భద్రతను అందిస్తుంది. Android 15 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌కు OnePlus నాలుగు ప్రధాన Android అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే, OnePlus 13లో 5000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పవర్ యూజర్లు, గేమింగ్ ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు ఇలా అందరికీ ఇది మంచి ఆప్షన్ కావడంతో పాటు, ఇప్పుడు Amazonలో లభిస్తున్న భారీ తగ్గింపు దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. Premium ఫీచర్లతో రీసనబుల్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం కోరుకునేవారికి OnePlus 13 మంచి ఎంపిక.
