Vegetable Prices: ఖమ్మంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై తీవ్ర ప్రభావం పడుతుంది. పలు రకాల కూరగాయలు కిలో రూ.100కు చేరాయి, ఓవైపు మొంథా తుఫాన్ చేసిన నష్టం వల్ల మరోవైపు కార్తీకమాసం నేపథ్యంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా సీజన్ మారినప్పుడు కొంతమేర ధరల్లో మార్పులు ఉంటాయి కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోనే కాకుండా ఖమ్మం నగరం తో పాటు గ్రామీణ మార్కెట్ల లో కూడా కూరగాయల ధరలు మండుతున్నాయి.
Also Read: Vegetable Prices: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.. సామాన్యుడు కొనేదెలా.. తినేదెలా..!
మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా?
చాలా రకాల కూరగాయలు పావుకేజీకి రూ.30నుంచి రూ.35లు కంటే తక్కువకు దొరకడం లేదు, అంటే కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా చిక్కుడు, వంకాయ, క్యారెట్, టమాటో, దోసకాయ, బీరకాయ, బెండకాయ , క్యాలీఫ్లవర్ క్యాబేజీ వంటి సాధారణ కూరగాయలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి . టమాటో , పచ్చి మిర్చి కూడా కిలో రూ.50లు ధర పలుకుతూ సామాన్యుడి వంటగది లో ఉండాల్సిన కూరలు , చారు సైతం మండిపోతోంది. ఇటీవల మొంథా తుఫాను కారణంగా పలు చోట్ల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీరు నిలిచిపోవడంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, క్వింటాళ్ల లో దిగుబడి కావాల్సిన చోట కిలోలలో నే దిగుబడి వస్తున్నందు వల్ల కూరగాయల సమస్య ఉత్పన్నం అయిందని అంటున్నారు .
Also Read: Commodities Prices: కొండెక్కిన పప్పులు కూరగాయల ధరలు.. తినేదెలా తెచ్చేదెలా!
