Telangana Govt: కొలువుల కేరాఫ్‌గా తెలంగాణ.. 61,379 ప్రభుత్వ
Telangana Govt ( IMAGE credit: swetcha REPORTER)
Telangana News

Telangana Govt: కొలువుల కేరాఫ్‌గా తెలంగాణ.. 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!

Telangana Govt: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయగా, మరో 8,632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011కు చేరుకుంది. త్వరలోనే లక్ష ఉద్యోగాల మైలురాయిని అందుకునే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం

ఉద్యోగాల భర్తీలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా విభాగంతో పాటు విద్యా రంగానికి, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నియామకాలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రక్షాళన చేపట్టారు. పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా ఉండేందుకు వయోపరిమితిని సడలించారు. నియామక ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిన రేవంత్, రెండేళ్లలో ఏకంగా 13 సార్లు కొలువుల పండగ వేడుకలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం, శిల్ప కళా వేదిక వంటి భారీ వేదికలపై నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతూ నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమాలు యువతతో పాటు వారి తల్లిదండ్రులకు కొత్త స్ఫూర్తిని అందించాయి. అంతేకాక, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి, నియామకాలను నిరంతర ప్రక్రియగా మార్చారు.

Also Read: Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!

సివిల్ సర్వీసెస్ తరహాలో

గతంలో పేపర్ లీకేజీ సమస్యలతో గందరగోళమైన నియామకాలను ప్రభుత్వం చక్కదిద్దింది. పేపర్ లీకేజీ కారణంగా గతంలో రద్దైన గ్రూప్-1 పరీక్షను కొత్త ప్రభుత్వం రద్దు చేసి, 562 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్ విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలను అందించింది. గ్రూప్-2 పరీక్షల్లో 782 మంది అభ్యర్థులకు అక్టోబరు 18న నియామక పత్రాలు అందించారు. గ్రూప్-3లో 1365 పోస్టులతో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు విడుదల కాగా, ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోంది. గ్రూప్-4 గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న తుది ఫలితాలను ప్రకటించి, 8,143 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 16,067 కానిస్టేబుల్ పోస్టులకు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 8,666 మందికి నియామకాలు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ హామీ అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, యువతకు ఉద్యోగం- తెలంగాణ భావోద్వేగం అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.

1. రెండేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ : 15,780
తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు : 16,067
మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు : 8,666
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు : 8,400
డీఎస్సీ- పాఠశాల విద్య: 10,006
టీజీ జెన్ కో, టీజీ ఎన్ పీడీసీఎల్ : 1105
సింగరేణి, ఇతర సంస్థలు : 1355
మొత్తం : 61,379

2. వైద్యశాఖలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు
నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్‌) : 6956
సివిల్ అసిస్టెంట్ సర్జన్ : 422
ఆయుష్ మెడికల్ ఆఫీసర్ : 138
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంఎన్‌జే) : 28
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ : 24
ఫిజియోథెరపిస్ట్‌ : 48
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ : 18
ల్యాబ్ టెక్నీషియన్ : 285 (2024)
ల్యాబ్ టెక్నీషియన్ : 1284 (2025)
జూనియర్ అసిస్టెంట్ : 334
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ : 01
మొత్తం : 9203

భర్తీ ప్రక్రియలో ఉన్న పోస్టుల వివరాలు
నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్‌) : 2322
ఫార్మసిస్ట్‌ : 732
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) : 1931
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 607
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ : 48
స్పీచ్ పాథాలజిస్ట్‌ : 4
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్‌) : 1623
గ్రూప్ 3 పోస్టులు ( నాన్ మెడికల్ ..సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతోంది): 1365
మొత్తం : 7267

Also Read: Telangana Govt: గ్రామీణ వైద్యులకు గుడ్ న్యూస్.. ఏజెన్సీల్లో పనిచేసే డాక్టర్లకు స్పెషల్ ఇన్సెటీవ్ !

Just In

01

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?