Revenue Officers: గురుకులాల పోస్టింగ్‌కు ఓ సీనియర్ మంత్రి ఆర్డర్
Revenue Officers ( image CREDIT: TWITTER)
Telangana News

Revenue Officers: గురుకులాల పోస్టింగ్‌కు ఓ సీనియర్ మంత్రి ఆర్డర్.. సంక్షేమ శాఖపై రెవెన్యూ ఆఫీసర్లు కన్ను?

Revenue Officers: రెవెన్యూ శాఖకు చెందిన కొందరు మహిళా ఆఫీసర్లు సంక్షేమ శాఖలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలోనే పనిచేసేందుకు ఎక్కువ మంది అధికారులు ఆసక్తి చూపుతుండగా, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు మహిళా ఆఫీసర్లు సంక్షేమ శాఖలోనే పనిచేయాలని తపన పడటం ఆశ్చర్యంగా ఉన్నది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్‌తో ఉన్న ఓ మహిళా ఆఫీసర్ ఎస్సీ గురుకులాల్లో జాయింట్ సెక్రెటరీ హోదాలో పనిచేస్తుండగా, మరో డిప్యూటీ కలెక్టర్ కూడా గురుకులాల్లోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఫోన్ చేస్తే ఇంకా ఆర్డర్ ఇవ్వకపోతే ఎట్లా?

ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి కీలక మంత్రితో సంక్షేమ శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ‘ఉదయం ఫోన్ చేస్తే ఇంకా ఆర్డర్ ఇవ్వకపోతే ఎట్లా’? అని సదరు సీనియర్ మంత్రి నేరుగా వెల్ఫేర్ మినిస్టర్‌కు ఫోన్ చేసి ప్రశ్నించినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. అక్కడితో ఆగకుండా నల్లగొండ సీనియర్ మంత్రి పీఏలు, ఓఎస్డీలు సంక్షేమ శాఖ మంత్రి ఆఫీసర్లపై ఆర్డర్ కోసం ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. ఇది సంక్షేమశాఖ ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: IAS Officers: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్.. స్నేహ శబరీశ్ బదిలీ!

ఆర్థిక బెనిఫిట్స్ కోసమేనా?

సంక్షేమ శాఖలో నిధులు భారీగానే ఉంటాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో స్కీమ్స్‌తో పాటు స్కూళ్లు, కాలేజీల నిర్వహణ వంటి వాటి కోసం ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయిస్తున్నది. ఈ క్రమంలో ఇక్కడ లావాదేవీలు, కాంట్రాక్టులు, టెండర్లు వంటి ప్రాసెస్‌లో ముడుపులు అధిక స్థాయిలో వస్తాయనే ప్రచారం ఉన్నది. దీంతోనే రెవెన్యూ శాఖలో ఆర్డీవో స్థాయి శాఖ అధికారులు కూడా ఈ శాఖలో పనిచేసేందుకు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం ఉన్నది. పైగా ప్రస్తుతం భూ భారతి తర్వాత రెవెన్యూ శాఖలో ఎలాంటి అవకతవకలకు పాల్పడే ఛాన్స్ లేదని స్వయంగా ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమశాఖలో పనిచేసేందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు సిఫారసులు చేయించుకోవడం ఆసక్తిని రెకేత్తిస్తున్నది.

ఫైనాన్స్ విభాగాలను ఆ ఇద్దరి ఆఫీసర్లు

వాస్తవానికి ఎస్సీ గురుకులంలో రెండు జాయింట్ సెక్రెటరీ పోస్టులు ఉండగా, అడ్మినిస్ట్రేషన్ , ఫైనాన్స్ విభాగాలను ఆ ఇద్దరి ఆఫీసర్లు పర్యవేక్షించేవారు. ఇటీవల ప్రస్తుతం జేఎస్‌గా పనిచేస్తున్న రెవెన్యూ ఆఫీసర్ ఒత్తిడితోనే ఫైనాన్స్‌లో జేఎస్‌ను తప్పించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ఆ స్థానంలో మరో రెవెన్యూ మహిళా ఆఫీసర్ వచ్చేందుకు ట్రై చేయడం గమనార్​హం. వాస్తవానికి గురుకులంలో పోస్టింగ్ కోసం ఉమ్మడి నల్లగొండ సీనియర్ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్న సదరు మహిళా ఆఫీసర్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే గురుకులాల్లో జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను గతంలో ఉన్నతాధికారులు సొంత శాఖకు తిప్పి పంపించగా, మళ్లీ మంత్రి ద్వారా ఆమె తిరిగి గురుకుల శాఖకు వచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేయడం విశేషం.

ఇతర శాఖల్లో పెరుగుతున్న మంత్రుల జోక్యం?

వాస్తవానికి ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకోవద్దని మంత్రులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు నొక్కి చెప్పారు. కానీ, కొందరు మంత్రుల్లో ఇప్పటికీ మార్పు కానరావడం లేదు. ఇదే సంక్షేమ మంత్రిపై గతంలో కూడా ఓ అధికారిని ఓఎస్డీగా పెట్టుకోవాలని సీనియర్ మంత్రి నుంచి లెటర్ వచ్చినట్లు సమాచారం. ఆ సీనియర్ మంత్రి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. మళ్లీ అదే నల్లగొండ జిల్లా నుంచి మరో సీనియర్ మంత్రి జేడీగా ఈ మహిళా ఆఫీసర్‌ను జాయింట్ సెక్రెటరీగా పెట్టుకోవాలని సూచించడం గమనార్హం. దీంతో సంక్షేమ శాఖ మంత్రి కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఆఫీసర్ నిబద్ధత, సమర్ధత, వ్యక్తిత్వం వంటి వాటిని పరిశీలించి మంత్రులు వారి సొంత శాఖల్లో ఆఫీసర్లు నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇతర మంత్రులు సిఫారసులతో కొందరు మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో తమ శాఖలకు చెడ్డపేరు వస్తుందనే భయం కూడా కొందరు మంత్రుల్లో ఉన్నది.

Also Read: Medchal Govt Lands: గతంలోనే పలుచోట్ల.. భూముల లెక్క తేల్చిన అధికారులు!

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్