Voter List Issue: సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకున్న ఓ మహిళ ఓటరు లిస్టులో తన పేరు లేకపోవటంతో హైకోర్టును ఆశ్రయించింది. మహబూబ్ నగర్ డీఎస్పీ కూతురైన రేణుక నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామంలో ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకుంది. అయితే, ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవటంతో ఖంగు తిన్న ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండు రోజుల్లో దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. కాగా, సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టుకు సూచనప్రాయంగా ఆమెకు చెప్పినట్టు సమాచారం.
Also Read: Kodanda Reddy: భూమి హక్కు రైతుకు ఉన్నట్టే విత్తన హక్కు ఉండాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా
నిబంధనల ప్రకారం ఓటరు జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటును తీసేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. దానికి ముందు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ కు ఓటు మిస్సింగుపై ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సరైన నిర్ణయం తీసుకోక పోతే జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేయాలి. అక్కడా చర్యలు తీసుకోకపోతే ఎన్నికల రాష్ట్ర ముఖ్య అధికారి వద్ద రివిజన్ పిటిషన్ వేయాలి. మూడు దశల్లోనూ న్యాయం జరగక, ఎన్నికలు దగ్గర పడి సమయం లేకపోతే నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు.
Also Read: Rupee Fall: ఒక్క డాలర్‌కు 90 రూపాయలు… దారుణంగా పతనం.. సామాన్యులపై ప్రభావం ఇదే!

