AICC Meenakshi Natarajan: మూడు నెలల్లో మీరు నిరూపించుకోండి
AICC Meenakshi Natarajan (imagecredit:twitter)
Political News, Telangana News

AICC Meenakshi Natarajan: మూడు నెలల్లో డీసీసీలు మీ పనితీరు నిరూపించుకోవాల్సిందే.. లేకుంటే తప్పుకోండి: మీనాక్షి నటరాజన్

AICC Meenakshi Natarajan: కొత్త డీసీసీలు తమ పనితీరును నిరూపించుకోవాల్సిందేనని ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నాటరాజన్(AICC Meenakshi Natarajan) పేర్కొన్నారు. మూడు నెలల్లో తమ పనితీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆమె హెచ్చరించారు. గుజరాత్ లో ఇదే ఫార్ములా అమవులుందన్నారు. మన దగ్గర కూడా ఇలాంటి రూల్ వచ్చే ఛాన్స్ ఉన్నదన్నారు. మంగళవారం ఆమె గాంధీభవన్ లో మాట్లాడుతూ.. మొట్ట మొదటి సారిగా ఏఐసీసీ అబ్జర్వర్స్ క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్యానెల్ ద్వారా డీసీసీలను ఎంపిక చేసినట్లు తెలిపారు.నిష్పక్షపాతంగా డీసీసీలు ఎంపిక జరిగిందన్నారు.

జనవరిలో నూతన డీసీసీలకు ట్రైనింగ్

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు వారి సొంత జిల్లాలో కూడా ఎవరి పేరు ప్రతిపాదించలేదన్నారు. కేవలం ప్యానల్ ద్వారా మాత్రమే డీసీసీల ఎంపిక జరిగిందన్నారు. అందరి సమన్వయం వల్లే సమర్థులైన డీసీసీల ఎంపిక జరిగిందన్నారు. డీసీసీల పనితీరు ఆధారంగా ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. పదవీకాలం ముగిసిన డీసీసీలతో కలిసి నూతన డీసీసీలు సమన్వయం చేసుకుంటూ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తు లేకపోయినా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపించుకోవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల లిస్ట్ సేకరణ జరగాలన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై కొట్లాడాలన్నారు. ఓట్ః చోరి సంతకాల సేకరణ వేగవంతం చేయాలన్నారు. జనవరిలో నూతన డీసీసీ లకు ట్రైనింగ్ ( అవగాహన సదస్సు) కార్యక్రమం ఉంటుందన్నారు.

Also Read: Gold Price Today: వామ్మో.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

రాహుల్ గాంధీ ఆకాంక్ష

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సీఎం జిల్లాల పర్యటన జరుగుతుందన్నారు. డీసీసీ పదవి ప్రముఖమైందన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని, కానీ పీసీసీ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. నిష్ణాతులైన ఏఐసీసీ అబ్జర్వర్స్ తో డీసీసీల ఎంపిక జరిగిందన్నారు. సీఎం, ఇంచార్జీ మీనాక్షి లు అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కుల సర్వే నిర్వహించామన్నారు. కుల సర్వే నిర్వహించాం కాబట్టే మోదీ జనగణన లో కుల సర్వే నిర్వహిస్తామని ప్రకటించారన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన కేంద్రానికి కనువిప్పు కలగలేదన్నారు. రెండు సంవత్సరాల లోపల ఆరు గ్యారెంటీ లలో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. సీఎం ,మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

వాటాల పంచాయితీ..

కేసీఆర్(KCR) పదేళ్ల పాలనలో రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. సీఎం నేతృత్వంలో సమన్వయంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మంచి మెజార్టీ తో గెలిచామన్నారు. పీసీసీ(PCC)గా ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నానన్నారు. ఏళ్ల తరబడి కష్టపడితేనే పదవులు వస్తాయని, పనికి తగిన గుర్తింపు కేవలం కాంగ్రెస్(Congress) లోనే ఉంటుందన్నారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీలు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. ఇక ఓట్ చోరీ కొంత ఆలస్యం అయ్యింది. వాటి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అభివృద్ది, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఇంకో దఫా కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. మహిళ,పేద ప్రజల సెంట్రిక్ గా ప్రజాపాలన జరుగుతుందన్నారు. ఇక కేసీఆర్ శకం ముగిసిందని, వాటాల పంచాయతీ లో తేడా వల్ల కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరిగిందన్నారు. వారం పది రోజుల్లో కార్పొరేషన్ తో పాటు పెండింగ్ లో ఉన్న పదవుల భర్తీ జరుగుతాయన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లు భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నదన్నారు.

Also Read: Harish Rao: గ్రామాలకు పెండింగ్ బిల్లులు ఎప్పుడిస్తారు? సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

Just In

01

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన