Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 87వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 87) కూడా కొన్ని ఛాలెంజెస్ జరిగాయి. 86వ రోజుకు సంబంధించి తనూజ (Tanuja), సుమన్ శెట్టి (Suman Shetty) మధ్య జరిగిన టాస్క్‌పై ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టికి భరణి, డిమోన్ పవన్ సపోర్ట్ చేయగా.. తనూజకు కళ్యాణ్, రీతూ, ఇమ్మానుయేల్ సపోర్ట్ చేశారు. సంజన సంచాలక్ పాత్రని పోషించారు. ఈ టాస్క్‌లో సంజన పాత్రపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సంచాలక్‌గా పర్ఫెక్ట్‌గా నిర్ణయాలు తీసుకున్నారని, సోషల్ మీడియాలో సైతం ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇమ్మానుయేల్ టాప్ రేసులోకి దూసుకెళ్లాడు. ఇక 87వ రోజు నిర్వహించిన ఛాలెంజ్‌లో మరో ముగ్గురు పడుతున్నట్లుగా తాజాగా మరో ప్రోమోను బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోని గమనిస్తే..
Also Read- Nandu: నేనంటే అందరికీ చిన్నచూపు.. ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నందు ఎమోషనల్!
మీరు మీరే మాట్లాడుకోండి. మేము ఎవరికీ ఓట్ వేయం
‘మూడో ఛాలెంజ్‌లో పాల్గొనే ముగ్గురు సభ్యులను ఎంపిక చేసే సమయం వచ్చింది. ప్రతీ ఛాలెంజ్‌ను ఎలా ఎదుర్కొంటారో, మీకోసం ఎలా పోరాడతారు అనేది, మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని బిగ్ బాస్ చెప్పారు. ఆ వెంటనే ‘అల్టర్‌నేట్‌గా నేను, రీతూ ఉన్నాం కాబట్టి..’ అని కళ్యాణ్ అనగానే భరణి (Bharani), పవన్ (Pawan) వ్యతిరేకించారు. లీనియన్స్ అని మాట్లాడే టైమ్ ఇది కాదని.. భరణి అంటే, ‘నెక్స్ట్ ముగ్గురు అనేది ఉండదు.. ఎవరికి తెలుసు?’ అని పవన్ వాదిస్తున్నాడు. ఉండదు అని నువ్వేలా చెబుతున్నావ్ అని హౌస్‌లోని కొందరు పవన్‌ని వ్యతిరేకించారు. ‘నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. ఐ వాంట్ టు గో’ అని పవన్ డిక్లేర్ చేశాడు. మార్నింగ్ వెళ్లిన ఒకరు, ఈవినెంగ్ వెళ్లిన ఒకరు, ఆడని వారు ఒకరు వెళ్లండి అని.. తనూజ సజెషన్ ఇస్తుంటే.. ‘ఇప్పుడు వెళ్లిన వాళ్లలోని వారిని కూడా ఒకరిని పంపిస్తారా?’ అని కళ్యాన్ క్వశ్చన్ చేశాడు. ఆ విషయంలో తనూజ, కళ్యాణ్ మధ్య వాగ్వివాదం నడుస్తోంది. ‘కళ్యాణ్.. అటు మాట్లాడతావ్, ఇటు మాట్లాడతావ్.. మరి మీరు మీరే మాట్లాడుకోండి. మేము ఎవరికీ ఓట్ వేయం’ అని తనూజ లేచి వెళ్లిపోయింది.
Also Read- Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!
పవర్ బాక్స్
ఏ ముగ్గురు ఆడబోతున్నారో చెప్పండి అని బిగ్ బాస్ అడగగానే.. ‘సుమన్ శెట్టి, పవన్ (Demon Pavan), కళ్యాణ్ (Kalyan)’ అని కెప్టెన్ కళ్యాణ్ బిగ్ బాస్‌కు చెప్పాడు. ‘ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న మూడో ఛాలెంజ్.. పవర్ బాక్స్. సెంటర్‌లో ఉన్న బ్లాక్స్‌ని, ఒక్కొక్కటిగా తీసుకుని మీ బాక్స్‌లో పెట్టాలి. ఎవరి బాక్స్‌లో అయితే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయో.. వారే ఈ ఛాలెంజ్‌లో విజేతలుగా నిలుస్తారు’ అని బిగ్ బాస్ చెప్పారు. అనంతరం కళ్యాణ్, పవన్, సుమన్ శెట్టి ముగ్గురు బ్లాక్స్ కోసం తలపడుతున్నారు. కళ్యాణ్ తన బ్లాక్స్‌ని చేతిలో పట్టుకుని అలా చూస్తూ ఉంటే.. కళ్యాణ్ గో అంటూ తనూజ అరుస్తుంది. పవన్, సుమన్ శెట్టి మాత్రం భీకరంగా పోరాడుతున్నారు. చూద్దాం మరి ఈ ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారో.. రిపోర్ట్ ప్రకారం కళ్యాణ్ ఈ టాస్క్‌లో గెలిచినట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
