Harish Rao: గ్రామ పంచాయతీలకు బిల్లులు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్‌లను జైలుకు పంపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాలకు పలువురు నేతలు హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను గో పెడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం.. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు!
గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు
గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఆపివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. బిల్లులు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచులను జైలుకు పంపించారన్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేక అధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగం చేసిందన్నారు. గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు లీవులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. తద్వారా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్‌కు సంగారెడ్డి నేతలుగుడ్ బై.. కండువాలు కప్పి ఆహ్వానించిన హరీశ్!
