Banda Prakash: హిల్ట్‌కు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఢిల్లీ దాకా
Banda Prakash ( image CREDIT: SWETCHA REPORTER)
Political News

Banda Prakash: హిల్ట్‌కు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళతాం.. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

Banda Prakash: వ్యవసాయ రంగం తో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత .. పరిశ్రమలు లేక పోతే ఉపాధి ఎట్లా? అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ -పి పేరిట పాలసీ తెచ్చింది..జీవో విడుదల చేసింది.. దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారన్నారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యం గా పెట్టుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసీ తెచ్చిందని ఆరోపించారు.

Also Read: MLAs Defection Case: ముగిసిన ఎమ్మెల్యేల క్రాస్‌ ఎగ్జామినేన్.. తిరిగి మల్లీ ఈ నెల 24న విచారణ

ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి

పరిశ్రమలకు భూములు ఇచ్చేటప్పుడే కాదు అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలని, సోషల్ ఇంపాక్ట్ స్టడీస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదు అని చెబుతున్నారు ..జీవోలో మాత్రం తొమ్మిది వేల ఎకరాల పైనే ప్రస్తావించారు ఎవరిని మోసం చేయడానికి అని నిలదీశారు.

వేల కోట్ల రహస్య ఒప్పందాలు

ఓ ఆర్ ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపించే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలని డిమాండ్ చేశారు. బిడ్డింగ్ ద్వారా ఉపయోగం లో లేని పరిశ్రమల భూములను అమ్మాలి. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలు అవుతోందన్నారు. హిల్ట్ పాలసీ రావడానికి వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ లో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని మండిపడ్డారు. ఫిలిం యూనిట్ల పై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదన్నారు. హిల్ట్ పాలసీ రద్దు చేసి పారిశ్రామిక భూములు వేలం వేయాలని డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళతామని స్పష్టం చేశారు.హిల్ట్ పాలసీపై ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

Also Read: Kolli Veera Prakash Rao: అక్క బాటలోనే తమ్ముడు.. కళ్లు చిరంజీవి ఐ బ్యాంక్‌కి.. భౌతిక కాయం అపోలో ఆసుపత్రికి!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!