GOAT Teaser Launch: సుడిగాలి సుధీర్ (Sudheer Anand) హీరోగా నటించిన ‘జీవోఏటీ’ (GOAT) సినిమాపై ఉన్న వివాదాలను చూస్తుంటే.. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అనే అనుమానాలు కలుగక మానవు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, వివాదాల ఉచ్చులో చిక్కుని బయటపడలేక ఇబ్బందులు పడుతోంది. ఎట్టకేలకు చిత్ర టీజర్‌ను మంగళవారం (డిసెంబర్ 2)న మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మూవీ గురించి నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్, హీరోయిన్ దివ్యభారతి చెబుతున్న విషయాలు వింటుంటే అంతా షాక్ అవుతారు. అలా ఉన్నాయి ఈ సినిమాపై వివాదాలు. జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్‌లో ‘అద్భుతం, టేనంట్’ వంటి చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాన అంశంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలవగా, తాజాగా వచ్చిన టీజర్ కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పడేలా చేస్తోంది. ఈ టీజర్‌ను గమనిస్తే..
టీజర్ ఎలా ఉందంటే..
టీజర్ స్టార్టింగ్‌లోనే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) జైలు నుంచి బయటకు వస్తున్నారు. అతని పేరే ‘సార్’ అని పరిచయం చేశారు. ‘ఆనందపురంలో ఒక డబ్బున్న అమ్మాయి, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనను ఎత్తుకొచ్చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానంది. అందులో 5 నీకు, 5 నాకు’ అని బ్రహ్మాజీ చెప్పగానే ‘డీల్ ఓకే’ అని సుధీర్ తన టీమ్‌తో వెళతాడు. అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాడు. ‘నా ఊరు కొచ్చి, ఒక అమ్మాయిన ఎత్తుకెళ్లేంత ధైర్యం చూపించాడంటే.. వాడికి భయమేంటో చూపించాలి’ అని విలన్‌ని పరిచయం చేశారు. ఇక సుధీర్ ఎత్తుకొచ్చిన అమ్మాయి మాములుది కాదని వాళ్లకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి సుధీర్ అండ్ టీమ్ ఏం చేసింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం అనేది ఈ టీజర్ తెలియజేస్తుంది. టీజర్ అయితే ఈ సినిమాలో నవ్వులు గ్యారంటీ అనేది తెలియజేస్తుంది.. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో..
Also Read- RJ Shekar Basha: హీరో ధర్మ మహేశ్ భార్య బెదిరిస్తుందంటూ ఆర్జే శేఖర్ భాషా పోలీసులకు ఫిర్యాదు
బడ్జెట్ భారీగా పెంచేశారు
ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి సుధీర్ హాజరు కాలేదు. అలాగే టీజర్‌లో కూడా సుధీర్ డబ్బింగ్ చెప్పినట్లుగా లేడు. దీనిపై నిర్మాత (Mogulla Chandrasekhar) వివరణ ఇస్తూ.. దర్శకుడు అండ్ టీమ్‌తో ఉన్న గొడవల కారణంగా సుధీర్ ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేయడం లేదు తప్పితే.. మా సైడ్ నుంచి ఆయనతో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఇంతకు ముందు ఉన్న టీమ్ ఈ సినిమా నిర్మాణానికి ముందు ఒక అమౌంట్ చెప్పి, ఆ తర్వాత దానికి నాలుగు రేట్లు అమౌంట్ చూపించారు. ఆ విషయంలో నేను వార్న్ కూడా చేశాను. మళ్లీ ఒక కొత్త టీమ్‌ని సెట్ చేసుకుని, టీజర్ రిలీజ్ వరకు వచ్చాము. ఇప్పటికైనా సుధీర్ తెలుసుకుని, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మీడియా వేదికగా ఆయన కోరారు. ఈ సినిమాకు దర్శకుడు నరేష్ చాలా ప్రాబ్లమ్స్ సృష్టించాడని, కొన్ని సీన్స్ కూడా లీక్ చేశాడని, అతనిపై ఛాంబర్‌లో ఫిర్యాదు కూడా చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read- Nandu: నేనంటే అందరికీ చిన్నచూపు.. ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నందు ఎమోషనల్!
సుధీర్‌ని అందుకే ఇన్వాల్వ్ చేశా..
ఇక హీరోయిన్ దివ్యభారతి (Divya Bharathi) కూడా రీసెంట్‌గా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ బాగా వైరలైన విషయం తెలిసిందే. ఆ ట్వీట్‌పై వివరణ ఇస్తూ.. ఆమె కూడా సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు పంపించిన తర్వాత దర్శకుడు సోషల్ మీడియాలో సినిమాపై నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశాడు. నన్ను చిలక అన్నందుకు కూడా నేను ఫీల్ కాలేదు. సుధీర్‌ని ఆ ట్వీట్‌లో ఎందుకు ఇన్వాల్వ్ చేశానంటే.. షూటింగ్ సమయంలో డైరెక్టర్, హీరో నన్ను భయపెట్టే విధంగా ప్రవర్తించారు. సినిమా లొకేషన్‌లో దర్శకుడు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నా.. సుధీర్ మాత్రం స్పందించలేదు. సుధీర్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.. అందులో నువ్వు ఐటం సాంగ్ చేయాలి అంటూ మెసేజ్‌లు పెట్టేవాడు. ఐటం సాంగ్ చేయడానికి నేను సిద్ధమే. కానీ ఆ మెసేజ్ మాత్రం నన్ను భయపెట్టడానికో.. ఇంకా దేనికో అన్నట్లుగా ఉండేది. అందుకే సుధీర్‌ని కూడా ఇన్వాల్వ్ చేశాను’’ అని దివ్యభారతి చెప్పుకొచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
