Akhanda 2: నందమూరి ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Akhanda 2 Thaandavam (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2: నందమూరి ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే వస్తోన్న ‘అఖండ 2’!

Akhanda 2: నందమూరి అభిమానులకు (Nandamuri Fans) ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు ఎంతగానో వెసులుబాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆఖరికి రజనీకాంత్ నటించిన డబ్బింగ్ సినిమా ‘కూలీ’, ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలకు కూడా అక్కడ టికెట్స్ ధరలు పెంచుకునే వెసులు బాటు కల్పించారు. అంత ఈజీగా ఉంది అక్కడ పాలసీ. ఇక రెండు రోజుల్లో మొదలు కాబోతున్న నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) నట తాండవానికి ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచుకునే వెసులు బాటు కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రం ‘అఖండ2: తాండవం’ (Akhanda2: Thaandavam)పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు అనుగుణంగా, ఈ సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్ల ధరల పెంపుతో పాటు, ఒక రోజు ముందు ప్రీమియర్‌కు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది.

Also Read- Nandu: నేనంటే అందరికీ చిన్నచూపు.. ‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నందు ఎమోషనల్!

పెరిగిన టికెట్ల ధరల వివరాలివే..

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం టికెట్ ధరలు ఎంత పెరిగాయంటే.. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధరపై రూ. 75, మల్లీప్లెక్స్‌లో రూ. 100 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోజుకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ.. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. ఇక ప్రీమియర్ విషయానికి వస్తే.. ఒక రోజు ముందే అంటే డిసెంటర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్‌కు అనుమతి ఇస్తూ.. ప్రీమియర్ టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మధ్య బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ అయితే కొడుతున్నారు కానీ, కలెక్షన్ల పరంగా సరైన రికార్డ్ మాత్రం ఆయన అకౌంట్‌లో లేదు.

Also Read- MP Niranjan Reddy: జాతీయ సంక్షోభంలో సింగిల్-స్క్రీన్ థియేటర్లు.. రాజ్యసభలో గళమెత్తిన ఎమ్‌పి

కాలర్ ఎగరేసి మరీ

ఇప్పుడొస్తున్న ‘అఖండ 2: తాండవం’ పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుండటం, ఏపీలో ప్రీమియర్‌కు అనుమతి, టికెట్ల ధరల పెంపు వంటి వన్నీ కలిసొచ్చాయి కాబట్టి.. ఈసారి కలెక్షన్ల పరంగానూ బాలయ్య రికార్డు కొట్టబోతున్నారని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. చూద్దాం మరి బాలయ్య బాక్సాఫీస్‌పై చేసే తాండవం ఎలా ఉండబోతుందో? మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నటసింహం బిడ్డ తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక బాలయ్య తాండవం ఎలా ఉంటుందో తెలియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. నందమూరి అభిమానులకు ఈ సమయం చాలా కష్టంగా గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదేమో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీ‌లో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?

Kadapa New Mayor: కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్.. కొత్త మేయర్ ఎంపికకు ఈసీ ఆదేశాలు

Putin Lands in Delhi: ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ

Breaking News: ‘అఖండ 2’ ప్రీమియర్స్ క్యాన్సిల్.. క్షమాపణలు చెప్పిన నిర్మాతలు

Marriage Scam: మామూలు స్కెచ్ కాదు.. పెళ్లి చేసుకుంటానని నిండా ముంచాడు.. లబోదిబోమంటున్న యువతి