Rahul walk owt about NEET
జాతీయం

National news: ‘నీట్’పై తగ్గేది లే

  • నీట్ పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్షాలు
  • రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామన్న స్పీకర్
  • రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ పై వివరణ ఇచ్చిన సభాపతి
  • స్పీకర్ తీరుపై వాకౌట్ చేసిన విపక్ష నేతలు
  • ఒక రోజంతా నీట్ పై చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ
  • నీట్ విద్యార్థులకు సభ నుంచి సందేశం ఇవ్వాలన్న రాహుల్
  • విద్యార్థుల కోసం ఓ ప్రకటన ఇవ్వాలని పట్టు
  • సభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్ ఆగ్రహం

Lok Sabha LoP Rahul Gandhi raises the NEET irregularities issue in the House

“నీట్ వివాదంపై ఓ ప్రకటన చేయాలి. అది ఈ పార్లమెంట్ వేదికగానే జరగాలి. నీట్‌ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదన్న భరోసా విద్యార్థులకు ప్రభుత్వమే ఇవ్వాలి. అందుకే పార్లమెంట్‌లో తప్పనిసరిగా చర్చ జరగాలి. ఓ రోజంతా సభలో చర్చించాల్సిన అవసరముందని భావిస్తున్నాం”
                                                                  -లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

పార్లమెంట్ లో నీట్ సెగలు ఇప్పట్లో చల్లారేలా లేవు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసపేటికే గందరగోళం నెలకొంది. ముందుగా సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్‌లో గెలుపొందిన టీమ్‌ ఇండియా జట్టుకు స్పీకర్‌ ఓం బిర్లా, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ , స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌కోహ్లీ, చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా టీమ్‌ఇండియా జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ అవడంపైనా వివరణ ఇచ్చారు స్పీకర్. అయితే…స్పీకర్ ఎంత సేపటికీ నీట్‌పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్‌ వివాదాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశమివ్వాలని అన్నారు. కానీ..అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఫలితంగా విపక్ష సభ్యులు నిరనస వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికే నీట్‌ని పదేపదే సభలో చర్చకు తెస్తున్నారు. ఒకరోజంతా పూర్తిగా ఈ వివాదంపై చర్చించేందుకే కేటాయించాలని స్పీకర్‌ని కోరారు.

వాయిదా తీర్మానం

లోక్ సభ ప్రారంభం కాగానే.. కొత్తచట్టాలు,నీట్ పై చర్చకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది కాంగ్రెస్. సభలో ఒక్క రోజు నీట్ పై చర్చించాలని రాహుల్ పట్టబట్టారు. విద్యార్థులకు సభ నుంచి ఒక్క సందేశం ఇవ్వాలని కోరారు. అయితే నోటీసులిస్తే పరిశీలిస్తామని స్పీకర్ అన్నారు. దీంతో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీట్ పై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. అయితే… సభా కార్యక్రమాలకు అడ్డుపడడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. దీంతో స్పీకర్ తీరుకు నిరసనగా ఇండియా కూటమి సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.

విపక్షాల ధర్నా

అంతకుముందు ప్రతిపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్ ముందు ఆందోళన చేపట్టాయి. దేశంలో కేంద్ర దర్యాప్తు ఏజేన్సీల దుర్వినియోగాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ, కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనితో పార్లమెంట్‌ ఆవరణలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మెయిన్‌ గేట్‌ దగ్గర ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. అధికారపక్షం తీరుకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై చర్చకు డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐల దుర్వినియోగం ఆపాలంటూ నిరసన చేశారు. కాగా, రెండ్రోజుల క్రితం నీట్ పై పార్లమెంట్ అట్టుడికిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కంటే ముందు నీట్ పై చర్చకు విపక్షాల పట్టుబట్టారు. నీట్ పై చర్చకు నిరాకరించడంతో తీవ్ర గందరగోళం చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై చర్చించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!