Nov 2025 Hits And Flops: నవంబర్‌ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఇవే..
Nov 2025 Movies List (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nov 2025 Hits And Flops: నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో ఏవి హిట్? ఏవి ఫట్?

Nov 2025 Hits And Flops: 2025లో మరో నెల ముగిసింది. నవంబర్ నుంచి డిసెంబర్‌లోకి అడుగు పెట్టాం. 2025 నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే, విడుదలైన చిత్రాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం సాధించగా, అత్యధిక శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. నవంబర్ నెలలో విడుదలైన తెలుగు సినిమాల హిట్స్, ఫ్లాప్స్ (Nov 2025 Hits And Flops) వివరాలను గమనిస్తే..

Also Read- EPIC First Semester: ‘90స్’ సీక్వెల్ ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ టీజర్ చూశారా.. ఆ బుడ్డోడు పెద్దై, ప్రేమలో పడితే!

విజయం సాధించిన చిత్రాలు (హిట్/సూపర్ హిట్/బ్లాక్‌బస్టర్) ఇవే..

నవంబర్‌లో మొత్తం ఐదు చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకొని విజయాన్ని నమోదు చేశాయి. అవేంటంటే.. రష్మిక మందన్నా (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయం ప్రకారం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai) ఊహించని విధంగా సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show) హిట్ చిత్రంగా నిలవగా, తాజాగా విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King Taluka) కూడా డీసెంట్ హిట్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇవి కాకుండా ‘జూటోపియా’ మూవీ సూపర్ హిట్ కాగా, ‘ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుని హిట్ చిత్రంగా నిలిచింది. నవంబర్‌లో విజయం సాధించిన చిత్రాలంటే ఇవి మాత్రమే. ఇక నిరాశపరిచిన చిత్రాల విషయానికి వస్తే.. లిస్ట్‌లో చాలానే ఉన్నాయి. ఈ నెలలో విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై, ఫ్లాప్‌గా మిగిలాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు, భిన్నమైన కథాంశాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.

Also Read- Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!

నిరాశపరిచిన చిత్రాలు (ఫ్లాప్) ఇవే..

నవంబర్ తొలి వారంలో వచ్చిన ‘జటాధర, తారకేశ్వరి, ప్రేమిస్తున్నా, కృష్ణ లీల, ఆర్యన్, డైస్ ఇరై, కాంత, రోలుగుంట సూరి, సీత ప్రయాణం కృష్ణతో, గత వైభవం’ సినిమాలు ఫ్లాప్‌గా నిలిస్తే.. నవంబర్ మధ్యలో వచ్చిన ‘సీమంతం, సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రీస్, ఆట కదరా శివ, లవ్ ఓటీపి, మా ఊరి వెంకన్న, గోపి గాళ్ళ గోవా ట్రిప్, శిశు: రోడ్ టు రివెంజ్, ప్రేమంటే, 12A రైల్వే కాలనీ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక నవంబర్ చివరిలో వచ్చిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటిలో.. ‘పాంచ్ మినార్, కలివి వనం, ఇట్లు మీ ఎదవ, ముఫ్తీ పోలీస్, ప్రేమలో రెండోసారి, హ్యాపీ జర్నీ, జనతా బార్, రివాల్వర్ రీటా, అంధక, మరువతరమా, స్కూల్ లైఫ్, ఖైదు’ వంటి సినిమాలు కూడా ఫ్లాప్‌గా నమోదయ్యాయి. ఓవరాల్‌గా చూస్తే.. 2025 నవంబర్ నెలలో చాలా సినిమాలు విడుదలైనప్పటికీ, అందులో ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు మాత్రమే మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక డిసెంబర్ నెల ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపల్ క‌మిష‌నరా మ‌జాకా.. పార పట్టి మట్టి ఎత్తిన పెద్దసారు..!

Jewelry Theft Case: జువెలరీ చోరీ కేసు చేధించిన పోలీసులు.. బయటపడిన నిజాలు ఇవే

Huzurabad Area Hospital: ఏరియా హాస్పిటల్‌లో ఓ రేడియాలజిస్ట్ చేతిలో బందీ అయిన స్కానింగ్ సెంటర్!

Ustaad Bhagat Singh: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. సర్‌ప్రైజ్ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

GHMC merger: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియలో కీలక పరిణామం