Illegal Plot Sales: అక్రమ పద్దతిలో ప్లాట్ల విక్రయాలు
–లేఅవుట్ పర్మిషన్ నెంబర్‌తో పనిలేదా..!
–జోరుగా వెలిసిన అందమైన బ్రోచర్లతో ప్రచారం
–వినియోగదారులను బురడి కొట్టిస్తున్న జేపీ ప్రాజెక్టు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: స్థిరాస్తి కొనుగోలుకు ప్రజలకు మక్కువ చూపిస్తున్నారు. దీంతో తెలంగాణలో వ్యాపారం విస్తరిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు గైడ్ లైన్స్ రూపోందించాయి. అయినప్పటికి రియల్ వ్యాపారులు ఆ నిబంధనలను లెక్కచేయకుండా వ్యవహారించడం సిగ్గుచేటు. సమాజానికి దూరంగా ఉండి ప్రభుత్వ చట్టాలపై గౌరవం లేని వాళ్లు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారంటే అర్థముంటుంది. కానీ ఓ ప్రజాప్రతిగా వ్యవహారిస్తూ.. ప్రభుత్వం చేసే చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన నేతలే చట్టాలకు తూట్టు పోడుస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని భావించే ఫోర్త్ సిటీ పక్కనే ఉండటం విశేషం. నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమికి మార్పు చేయాలి. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం లేవుట్ ప్రతిపాదనలు పంపి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో భూమిని చదును చేసుకోని లేఅవుట్ చేసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి ట్యాంకు పార్కు, క్రీడా ప్రాంగణం తదితర సౌకర్యాలను కల్పించాలి. అప్పుడే ప్లాట్లు విక్రయాలు జరుపుకోవాలి. ఈ నిబంధనలకు విరుద్దంగా అధికార పార్టీ నాయకుడనే ధీమాతో అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేయడం చట్ట విరుద్దం.
లేవుట్ అనుమతి అవసరం లేదా..?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్న ఫోర్త్ సీటి(Fourth Ciy)లో అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయాలు చేయడమంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఇలాంటి సంఘటనలు మహేశ్వరం మండలం తుమ్మలూర్లో కనిపిస్తోంది.హెచ్ఎండీఏ(HMDA) నుంచి లేఅవుట్లకు అనుమతులు తీసుకుని రెరా(Rera)లో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు కొందరైతే అసలు అనుమతులే తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తున్నవారు మరికొందరు ఉన్నారు. ప్రధానంగా రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో మహేశ్వరం, కడ్తాల్, అమన్‌గల్లు, కందుకూర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల పరిధిలో అత్యధికంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏడాది కోకొల్లాలుగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా అనుమతులు లేకుండా విక్రయాలు చేయడం ఆ తర్వాత లేవుట్ అభివృద్ధితో కాలయాపన చేస్తూ వినియోగదారులను అవస్థలకు గురిచేస్తున్నారు. వీటికి అడ్డుకట్టే వేసేందుకు ప్రభుత్వం హైడ్రా లాంటి సంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రయోజనం లేదని అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. భూ సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే విచారణ జరిపి న్యాయబద్ధంగా శిక్షలు వేస్తే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. కానీ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే వ్యక్తులు తప్పులు చేస్తే ఒక విధంగా.. సాధరణ వ్యాపారులు చేస్తే మరోలా వ్యవహారించడంతో అనుమానాలు వస్తున్నాయి. నిబంధనలకు లోబడి చట్టానికి వ్యతిరేకంగా లేవుట్లు చేసే వ్యక్తులపై కఠినమైన చర్యలు చేపట్టినప్పుడే ప్రజలకు భరోసా దోరుకుతుంది.
Also Read: Rumour Controversy: వారి బ్రేకప్ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
హెచ్ఎండీఏ(HMDA) నుంచి అనుమతి, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న లేఅవుట్లలోనే స్థలాలు కొనాలి. ప్లాట్లు విక్రయించే వ్యాపారుల నుంచి లేఅవుట్ నమూనా పత్రం తీసుకుని సంబంధిత సంస్థ కార్యాలయంలో సంప్రదించి నిర్ధారించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రెరా వెబ్‌సైట్‌ను పరిశీలించడం ద్వారా ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉందో, లేదో తెలుసుకోవచ్చు. వీటన్నింటిని ప్రమాణికంగా తీసుకోని ముందుకెళ్లాలి. కానీ రియల్ వ్యాపారులు ఏర్పాటు చేసే కటౌట్లకు, ఫ్లేక్సీలతో మోసపోవద్దు. కనీసం 10-13 ఏళ్లకు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) తీసుకోవడం ద్వారా స్థలంపై బ్యాంకు రుణాలు, కేసులు ఉన్నాయా? లేదా? అనేది తెలుస్తుంది. లేఅవుట్‌లో రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించాలి. బ్యాంకింగ్ మార్గంలో డబ్బు చెల్లించి రశీదు తీసుకోవాలి.
జేబీ ఇన్ఫా గ్రూప్ మాయజాలం..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 371, 372, 374, 377 సర్వే నెంబర్ల్లో లేవుట్ నిర్మాణం చేస్తున్నారు. భూ కోనుగోల విస్తీర్ణంకు, లేవుట్ విస్తీర్ణకు పోంతన లేదు. మిగులు భూమికి పక్కనున్న పట్టా భూమిని జేజీ ఇన్ఫా గ్రూప్(JG Info Group) యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ భూమి పక్కనున్న సర్వే నెంబర్ కేటాయించిన భూమిపై జేపీ ఎన్ఫ్రీ కన్నేసింది. ఆ భూమిని కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పహాణీలో పోందుపర్చినట్లుగా విస్తీర్ణం తక్కువగా ఉంది. అదే విస్తీర్ణం భూ భారతిలో పెరిగిపోవడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్లేక్సీలు వేసి వినియోగదారులను బురడి కొట్టించడం జేబీ ఇన్ఫ్రాకు ఆలవాటుగా మారిపోయింది.
Also Read: Euphoria Teaser: గుణశేఖర్ ‘యుఫోరియా’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఏం థ్రిల్ ఉంది మామా..
